Home న్యూస్ కన్నడ గడ్డ మీద రెబల్ స్టార్ మాస్ పవర్….3 గంటల్లో ఎన్ని టికెట్స్ సేల్ అయ్యయో...

కన్నడ గడ్డ మీద రెబల్ స్టార్ మాస్ పవర్….3 గంటల్లో ఎన్ని టికెట్స్ సేల్ అయ్యయో తెలుసా!!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభస్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) మూవీ ఆడియన్స్ ముందుకు భారీ అంచనాల నడుమ ఈ నెల 27న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా ఆల్ రెడీ సినిమా ఓవర్సీస్ లో…

బుకింగ్స్ పరంగా సెన్సేషనల్ జోరుని చూపించి రికార్డ్ లెవల్ బుకింగ్స్ తో జోరు చూపిస్తూ ఉండగా సినిమా ఇండియాలో బుకింగ్స్ మెల్లి మెల్లిగా ఓపెన్ అవుతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ కొంచం ఆలస్యంగా ఓపెన్ కానుండగా రీసెంట్ గా సినిమా బుకింగ్స్…

కర్ణాటకలో ఓపెన్ అవ్వగా అక్కడ రికార్డ్ లెవల్ లో బుకింగ్స్ తో దూసుకు పోతుంది…రీసెంట్ టైంలో బెస్ట్ బుకింగ్స్ తో రచ్చ చేస్తున్న కల్కి మూవీ కర్ణాటకలో సెలక్టివ్ ఏరియాల్లో బుకింగ్స్ ను ఓపెన్ చేయగా 3 గంటల్లో వ్యవధిలో సినిమా బుకింగ్స్ రికార్డ్ లెవల్ లో జోరు చూపిస్తున్నాయి…

3 గంటల గ్యాప్ లో ఆల్ మోస్ట్ కర్ణాటకలో 13 వేలకు పైగా టికెట్ సేల్స్ జరిగాయి. అందులో ఒక్క బెంగళూరు లోనే సినిమా టికెట్ సేల్స్ 10 వేలకు పైగా జరిగాయి… ఆల్ మోస్ట్ కర్ణాటకలో 3 గంటల గ్యాప్ లో సినిమా బుకింగ్స్ ద్వారా 50 లక్షలకు పైగా గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది…

మిగిలిన ఏరియాల్లో కూడా బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత సంచలనాలు సృష్టించే అవకాశం ఎంతైనా ఉండగా మొత్తం మీద సినిమా రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ తో మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉంది. ఇక మొదటి రోజు సినిమా కర్ణాటకలో సైతం ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుని రచ్చ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here