బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు అడుగు పెట్టిన ఆచార్య సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మరోసారి హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకుని పరుగును కొనసాగిస్తుంది, సినిమా రెండో రోజు తో పోల్చితే మూడో రోజు 30% రేంజ్ కన్నా ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాల్లో 3.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది… సినిమా ఫైనల్ లెక్కలు బాగుంటే 3.5 కోట్ల దాకా షేర్ ని అందుకోవచ్చు అని చెప్పాలి.
ఇక కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా లో కంప్లీట్ గా స్లో అయిన సినిమా షోలు కూడా కాన్సిల్ అయ్యాయి అని చెప్పాలి. ఇక ఓవర్సీస్ లో కూడా భారీ గా స్లో అయిన సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 3 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు….
4 కోట్ల నుండి 4.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ చాలా పెద్దది అవ్వడంతో సినిమా ఈ కలెక్షన్స్ అసలు బ్రేక్ ఈవెన్ దరిదాపుల్లోకి కాదు కదా సగం కూడా అందుకునే అవకాశం లేదనే చెప్పాలి. ఇక మొదటి వీకెండ్ లో సినిమా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి…