బాక్స్ ఆఫీస్ దగ్గర భీమ్లా నాయక్ రాంపేజ్ కొనసాగుతుంది, సినిమా మొదటి రోజు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత రెండో రోజు ఊరమాస్ హోల్డ్ ని సొంతం చేసుకున్న సినిమా మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు ఎంటర్ అవ్వగా సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో దూసుకు పోతుంది అని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా 2 రోజుల్లో ఇప్పుడు 39.56 కోట్ల షేర్ ని అందుకోగా సినిమా….
రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 13.14 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. ఇక మూడో రోజు సినిమా ఓపెనింగ్స్ పరంగా ఆల్ మోస్ట్ 2 వ రోజు లెవల్ లోనే ఓపెన్ అవ్వగా కొన్ని సెంటర్స్ లో ఆక్యుపెన్సీ రెండో రోజు కన్నా కూడా కొంచం బెటర్ గానే ఉందని చెప్పాలి…
ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ కూడా ఆదివారం అవ్వడంతో ఎక్స్ లెంట్ గా కొనసాగుతున్నాయి అని చెప్పాలి. ఇక సినిమా అమెరికా లో 2 రోజుల్లో 1.8 మిలియన్ మార్క్ ని అందుకుని అక్కడ కూడా దుమ్ము లేపగా సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో మూడో రోజు కి వచ్చే సరికి….
ప్రజెంట్ ట్రెండ్ ని గమనిస్తే 12 కోట్ల నుండి 12.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా గ్రోత్ సాలిడ్ గా చూపించే అవకాశం కూడా ఉంది కాబట్టి సినిమా ఇప్పుడు 13 కోట్ల రేంజ్ కి వెళ్ళే అవకాశం కూడా ఉందని చెప్పాలి. మరి ఈవినింగ్ అండ్ నైట్ షోల టైం కి…
ఈ రేంజ్ లెవల్ లో ఉంటుందా లేక ఈ రేంజ్ కి మించి ఉంటుందా అన్నది చూడాలి ఇక… మొత్తం మీద మూడో రోజు కూడా ఇప్పుడు భీమ్లా నాయక్ బాక్స్ ఆఫీస్ ఊచకోత కొస్తుంది అని చెప్పాలి. మాస్ సెంటర్స్ లో సాలిడ్ హోల్డ్ తో సినిమాకి లాంగ్ రన్ మరింత సాలిడ్ గా ఉండే అవకాశం ఉందని చెప్పాలి. ఇక డే 3 ఎండ్ అయ్యే టైం కి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.