రెండు రోజుల్లో ఊరమాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ మూడో రోజు సండే అవ్వడంతో ఆ అడ్వాంటేజ్ ను సాలిడ్ గా వాడుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి స్ట్రాంగ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది. సినిమాకి మూడో రోజు కూడా భారీగా హోల్డ్ చేసిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తెలుగు రాష్ట్రాలో మరోసారి ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసింది అనే చెప్పాలి ఓవరాల్ గా…
సినిమా రెండో రోజు తో పోల్చితే 10-15% వరకు డ్రాప్ అయినా కానీ ఈవినింగ్ షోలలో రాంపేజ్ కనిపించింది, నైజాం కొంచం టికెట్ హైక్స్ మరీ ఎక్కువ ఉండటం వలన స్లో అయినా ఆంధ్ర అండ్ సీడెడ్ ఏరియాల్లో ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెట్టిన సినిమా మొత్తం మీద ఇప్పుడు…
మూడో రోజు తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ రెండో రోజు కి చేరువ అయ్యేలా 30 కోట్లకి అటూ ఇటూగా కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక హిందీ లో మూడో రోజు ఊరమాస్ హోల్డ్ ని చూపెట్టిన సినిమా ఈ రోజు అక్కడ 28-30 కోట్ల మధ్యలో నెట్ కలెక్షన్స్ ని అందుకోవచ్చు…
ఇక ఓవరాల్ గా సినిమా ఈ రోజు అన్ని చోట్లా ఎలాంటి కలెక్షన్స్ ని సాధించే అంచనా ఉందంటే…
AP-TG: 30~
Karnataka: 4.3cr~
Tamil Nadu: 4.8cr~
Kerala: 1.8cr~
HINDI & ROI: 15Cr~
Overseas: 10cr~
Worldwide: 66Cr~
ఇదీ మొత్తం మీద మొదటి రోజు సినిమా వరల్డ్ వైడ్ గా అందుకునే ఛాన్స్ ఉన్న షేర్ లెక్కలు… ఓవరాల్ గా అన్ని చోట్లా…
ఉండే ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మరో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని మూడో రోజు సొంతం చేసుకోబోతున్న సినిమా ఓవరాల్ గా మొదటి వీకెండ్ 3 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ లెక్క ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి ఇక…అఫీషియల్ వీకెండ్ కలెక్షన్స్ రిపోర్ట్స్ వచ్చాక అప్ డేట్ చేస్తాం.