యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఆర్ ఆర్ ఆర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ టైం రికార్డ్ ఓపెనింగ్స్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ సంచలనం సృష్టిస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా తెలుగు రాష్ట్రాలలో రెండో రోజు ఎక్స్ లెంట్ హోల్డ్ తో 31 కోట్లకు పైగా షేర్ ని అందుకోగా….
కొత్త రికార్డులను నమోదు చేయగా మూడో రోజు లో ఎంటర్ అయిన ఈ సినిమా మూడో రోజు మరోసారి ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతుంది, భారీ టికెట్ హైక్స్ వలన మాస్ సెంటర్స్ లో డ్రాప్స్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా మూడో రోజు సినిమా…
తెలుగు రాష్ట్రాల్లో 15% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ టెర్రిఫిక్ అనిపించే లెవల్ లో ఉండటంతో ఈ రోజు సినిమా 28 కోట్ల నుండి 29 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని మినిమమ్ అందుకోవచ్చు, ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే…
కలక్షన్స్ ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది, ఇక కర్ణాటకలో, తమిళ్ లో ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపిస్తున్న సినిమా అక్కడ మూడో రోజు 8-10 కోట్ల రేంజ్ గ్రాస్ ని వేరు వేరుగా సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక హిందీ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజు మరింత భారీగా గ్రోత్ తో దూసుకు పోతూ ఉండగా ఈ రోజు ఇక్కడ కలెక్షన్స్ లెక్క…
28-30 కోట్ల రేంజ్ లో ఉండే ఛాన్స్ ఎంతైనా ఉందని అక్కడ ట్రేడ్ వర్గాలు చెబుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఇక ఓవరాల్ గా సినిమా రోజు ముగిసే సరికి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇదే రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుంటుందా లేక ఇంకా ముందుకు వెళుతుందో చూడాలి. డే ఎండ్ అయ్యే టైం కి సినిమా స్టేటస్ చూసి మరో సారి కలెక్షన్స్ ని అప్ డేట్ చేస్తాం.