మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజుల్లో టోటల్ గా 67.6 కోట్ల షేర్ ని అందుకోగా సినిమా మూడో రోజు మరో వర్కింగ్ డే టెస్ట్ ను ఎదురు కుంది, కాగా సినిమా రెండో రోజు తో పోల్చితే మూడో రోజు డ్రాప్స్ 35% వరకు ఉన్నాయి. అవి ఈవినింగ్ అండ్ నైట్ షోలకు 5 టు 8% వరకు తగ్గి మంచి గ్రోత్ నే సాధించాయి.
దాంతో రెండో రోజు పోల్చితే మూడో రోజు 6.5 కోట్ల రేంజ్ నుండి 7 కోట్ల వరకు షేర్ అనుకున్నా ఇప్పుడు 7.5 కోట్ల వరకు షేర్ ని సినిమా అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. మాస్ సెంటర్స్ లో కంప్లీట్ ఆఫ్ లైన్ రిపోర్ట్స్ తేలాల్సి ఉండగా అవి కూడా బాగుంటే…
సినిమా మొత్తం మీద మూడో రోజు 7.5 కోట్ల నుండి 8 కోట్ల లోపు షేర్ ని అందుకునే అవకాశం ఉంటుంది, అలా జరిగితే రెండో రోజు కన్నా మూడో రోజు టోటల్ డ్రాప్స్ 20% వరకు మాత్రమె ఉండే అవకాశం ఉంది, మరి తెలుగు లో మూడో రోజు అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.
ఇక సినిమా హిందీ లో మిగిలిన చోట్ల స్లో డౌన్ అయింది, అంత పాజిటివ్ టాక్ ఉన్నా హిందీ గ్రోత్ లేకపోవడం కొంచం షాకింగ్ గా ఉంది, ఇండియా లో మిగిలిన చోట్ల మూడో రోజు సినిమా 1 కోటి నుండి 1.2 కోట్ల దాకా షేర్ ని అందుకోవచ్చు. ఇక ఓవర్సీస్ లో కూడా వర్కింగ్ డే అవ్వడం తో అక్కడ కూడా సినిమా స్లో అయింది.
అక్కడ టోటల్ గా 30 నుండి 50 లక్షల వరకు షేర్ ని సినిమా అందుకోవచ్చు. దాంతో మూడో రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 9 కోట్ల నుండి 9.5 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది, దాంతో సినిమా మూడో రోజు టార్గెట్ ని కొట్టింది అనే చెప్పాలి. ఇక అఫీషియల్ గా మూడు రోజుల కలెక్షన్స్ లెక్కలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.