ఈ ఇయర్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిన్న మరియు డబ్బింగ్ మూవీస్ లో అటు బాక్స్ ఆఫీస్ దగ్గర ఓటు బుల్లి తెరపై కూడా మెప్పించిన సినిమా లు కొన్నే ఉన్నాయి. వాటిలో ఇప్పుడు మలయాళం నుండి తెలుగు లో డబ్ అయిన దుల్కర్ సల్మాన్ నటించిన కనులు కనులను దోచాయంటే సినిమా ముందు నిలుస్తుంది అని చెప్పాలి. చిత్ర విచిత్రమైన పరిస్థితులను ఎదురుకుంది ఈ సినిమా రిలీజ్ టైం లో…
టాక్ బాగున్నా చూసే వాళ్ళు లేక మొదటి వీకెండ్ తర్వాతే థియేటర్స్ నుండి ఔట్ అయిన సినిమా మళ్ళీ జనాలు థియేటర్స్ రావడం మొదలు పెట్టడం తో రెండో వీకెండ్ నుండి తిరిగి జోరు చూపి స్టడీ కలెక్షన్స్ ని అందుకుంటూ ఉండగా…
ఇక భారీ విజయాన్ని సినిమా నమోదు చేస్తుంది అని అంతా అనుకుంటున్న టైం లో కరోనా ఎఫెక్ట్ వలన థియేటర్స్ మూసేయడంతో ఈ సినిమా పరుగు ఆగిపోయింది, కానీ అప్పటికే సాధించిన కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ అయిన ఈ సినిమా తర్వాత టెలివిజన్ లో టెలికాస్ట్ అవ్వగా స్టడీ రేటింగ్స్ ని సాధిస్తూ దూసుకు పోతుంది.
మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు 7.1 రేటింగ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా రెండో సారి టెలికాస్ట్ అయినప్పుడు 3.94 రేటింగ్ ని సొంతం చేసుకుని మరోసారి హోల్డ్ చేయగా మూడో సారి మార్నింగ్ టైం లో టెలికాస్ట్ అయినా కానీ 3.88 రేటింగ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా అప్పుడు కూడా హోల్డ్ చేయడం విశేషం అనే చెప్పాలి.
సినిమాను మొత్తం మీద శాటిలైట్ రైట్స్ కూడా 1 కోటి కి అటూ ఇటూ గానే అమ్మగా సినిమా మూడు సార్లు టెలికాస్ట్ అయ్యి మంచి ప్రాఫిట్స్ ని ఛానెల్ కి దక్కేలా చేసింది ఈ సినిమా. ఈ ఇయర్ రిలీజ్ అయిన చివరి హిట్ మూవీ కూడా ఈ సినిమానే అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయో లేదో అన్న డౌట్ ఉండగా ఈ సినిమానే లాస్ట్ హిట్ గా నిలవబోతుంది.