యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా వచ్చి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో 2 వారాల్లో దుమ్ము దుమారం లేపే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. ఇక మూడో వారంలో అడుగు పెట్టిన సినిమా కి…
రెండో వీక్ వర్కింగ్ డేస్ నుండి అన్ సీజన్ ఇంపాక్ట్ వలన డ్రాప్స్ ఎక్కువగానే కనిపించగా…ఇక ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు కొత్త సినిమాలు రావడంతో ఆ సినిమాల ఇంపాక్ట్ వలన థియేటర్స్ కూడా తగ్గాయి… మరి ఓవరాల్ గా ఎన్ని థియేటర్స్ లో..
తండేల్ సినిమా మూడో వీక్ ని కొనసాగిస్తుంది అన్నది ఆసక్తిగా మారగా…రిలీజ్ అవ్వడం ఆల్ మోస్ట్ 750 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయిన తండేల్ మూవీ రెండో వీక్ ను సుమారు 340 వరకు థియేటర్స్ లో కొనసాగించింది… ఇక మూడో వీక్ లో సినిమా…
నైజాంలో 55 వరకు థియేటర్స్ లో రన్ ని కొనసాగిస్తూ ఉండగా, కోస్టల్ ఆంధ్ర మరియు సీడెడ్ లో కలిపి మరో 120 వరకు థియేటర్స్ లో సినిమా మూడో వారాన్ని ఇప్పుడు కొనసాగిస్తుంది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో తండేల్ మూవీ ఇప్పుడు మూడో వీక్ లో సుమారు 175 వరకు థియేటర్స్ లో…
పరుగును కొనసాగిస్తుంది. అన్ సీజన్ లో ఇతర సినిమాల మధ్య పోటిలో సినిమా కి మంచి కౌంట్ దక్కింది అని చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమా రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో స్లో డౌన్ అవ్వగా వరల్డ్ వైడ్ గా సినిమా మూడో వీక్ లో 220 వరకు థియేటర్స్ లో పరుగును కొనసాగిస్తుంది. మరి మూడో వీక్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.