నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమా మంచి అంచనాల నడుమ రిలీజ్ అవ్వగా సినిమా టాక్ పాజిటివ్ గా ఉన్నప్పటికీ వసూళ్ళ పరంగా అనుకున్న రేంజ్ లో జోరుని మొదటి 2 రోజుల్లో చూపించలేదు, కానీ మూడో రోజు నుండి దసరా హాలిడేస్…
స్టార్ట్ అవ్వడంతో సినిమా జోరు కూడా పెంచి అన్ని చోట్లా మంచి ట్రెండ్ ను ఈ రోజు చూపిస్తూ ఉండటం విశేషం, ట్రాక్ చేసిన సెంటర్స్ లో ఆల్ మోస్ట్ డే 2 కి సిమిలర్ గా ఓపెన్ అయిన సినిమా కొన్ని చోట్ల బెటర్ గా కూడా ట్రెండ్ అవుతూ ఉండగా కొన్ని చోట్ల స్క్రీన్స్ ను కూడా పెంచారు… దాంతో సినిమా రెండో రోజు లెవల్ లో…
అన్నీ అనుకున్నట్లు జరిగితే రెండో రోజు కన్నా బెటర్ కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకునే అవకాశం ఉంది, సినిమా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 4-4.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే ఛాన్స్ ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అన్ని చోట్లా బాగుంటే…
5 కోట్ల రేంజ్ నుండి 5.5 కోట్లు ఆ పైన షేర్ వెళ్ళే అవకాశం ఉందని చెప్పాలి. అంతకుమించి వస్తే అది ఊచకోత అనే చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 6.5 కోట్లకు అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉంది. మొత్తం మీద మూడో రోజు నుండి చూపిస్తున్న జోరు ఇలాగే దసరా సెలవుల్లో కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక టోటల్ గా 3 రోజుల కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.