బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండిపెండెన్స్ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన భోలాశంకర్(Bhola Shankar) మరియు సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన జైలర్(Jailer Movie) లు రెండింటిలో…
జైలర్ మూవీ ఊచకోత కోస్తూ దూసుకు పోతూ ఉండగా భోలా శంకర్ మాత్రం అనుకున్న దానికన్నా కూడా భారీ డ్రాప్స్ తో నిరాశ పరుస్తూ ట్రేడ్ కి మైండ్ బ్లాంక్ చేస్తుంది… ఇక భోలా శంకర్ మూడో రోజులో అడుగు పెట్టగా సినిమాకి సండే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా…
ఏమాత్రం హోల్డ్ ని చూపించడం లేదు. దాంతో ఈ రోజు కలెక్షన్స్ మరింతగా తగ్గే అవకాశం కనిపిస్తూ ఉండగా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 2 కోట్లు కూడా కష్టంగానే కనిపిస్తూ ఉంది. ఇక జైలర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగో రోజు ఆల్ మోస్ట్ భోలా శంకర్ సినిమా మీద…
డబుల్ గ్రోత్ ని ట్రెండ్ ని చూపిస్తూ దూసుకు పోతూ ఉండటంతో ఈ రోజు సినిమా ప్రజెంట్ ట్రెండ్ చూస్తూ ఉంటే మరోసారి 4 కోట్ల రేంజ్ కి తగ్గని షేర్ కన్ఫాం కాగా సినిమా అన్ని చోట్లా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో మరింత జోరు పెంచే అవకాశం ఉండగా…
సినిమా 4.5 కోట్ల రేంజ్ నుండి ఆ పైన షేర్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉంది తెలుగు రాష్ట్రాల్లో… డే ఎండ్ అయ్యే టైంకి అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపోతే ఈ కలేక్ష్నాస్ కూడా పెరిగే అవకాశం ఉంది. భోలా శంకర్ కి మాత్రం ఏమైనా అద్బుతాలు జరగాల్సి ఉంటుంది.