Home న్యూస్ 3rd DAY డాకు మహారాజ్ కలెక్షన్స్….తుక్కురేగ్గొడుతున్న బాలయ్య మాస్ జాతర!!

3rd DAY డాకు మహారాజ్ కలెక్షన్స్….తుక్కురేగ్గొడుతున్న బాలయ్య మాస్ జాతర!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హాట్రిక్ హిట్స్ ఫామ్ తో దూసుకు పోతున్న నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ మూవీ దుమ్ము లేపే ఓపెనింగ్స్ తో బాలయ్య కెరీర్ బెస్ట్ వసూళ్ళతో మాస్ రచ్చ చేస్తూ ఉండగా సినిమా మూడో రోజు సంక్రాంతి పండగ అడ్వాంటేజ్ ఉండటంతో ఓ రేంజ్ లో కుమ్మేస్తూ దూసుకు పోతూ ఉంది అన్ని చోట్లా కూడా…..

ఒక పక్క సంక్రాంతికి వస్తున్నాం సినిమా వీర లెవల్ లో కుమ్ముతూ ఉన్నప్పటికీ డాకు మహారాజ్ కూడా మాస్ సెంటర్స్ లో ఏమాత్రం తగ్గకుండా హోల్డ్ ని చూపెడుతుంది. ఆల్ మోస్ట్ ట్రాక్ చేసిన సెంటర్స్ లో రెండో రోజుకి ఈక్వల్ గా సినిమా బుకింగ్స్ ట్రెండ్ కనిపిస్తూ ఉండగా, కొన్ని స్క్రీన్స్ సంక్రాంతికి వస్తున్నాం…

Daaku Maharaaj Movie 1st Day Total WW Collections!!

సినిమాకి వెళ్ళినప్పటికీ కూడా ఎక్స్ లెంట్ ఆక్యుపెన్సీతో దూసుకు పోతూ ఉండటంతో 3వ రోజున ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి మరోసారి 8-9 కోట్ల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది ఇప్పుడు…ఆఫ్ లైన్ లెక్కలు పూర్తిగా అంచనాలను మించిపోతే…

ఈ షేర్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా మంచి జోరునే చూపెడుతున్న సినిమా ఓవర్సీస్ లో మరోసారి పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేస్తూ మాస్ రచ్చ చేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు…

దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 3వ రోజున ఇప్పుడు మరోసారి 11-12 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా, ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఫెంటాస్టిక్ హోల్డ్ తో మాస్ రచ్చ చేస్తున్న డాకు మహారాజ్ 3 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here