బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 2 రోజుల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ సాలిడ్ రికవరీని సొంతం చేసుకున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1 3rd Day Box Office Collections) మూడో రోజు సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా మాస్ రచ్చ చేస్తూ దుమ్ము లేపుతుంది..
సినిమా మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో డీసెంట్ హోల్డ్ ని చూపించగా నైట్ షోలకు కొంచం డ్రాప్స్ ఉండగా కోస్టల్ ఆంధ్ర మరియు సీడెడ్ ఏరియాల్లో మాత్రం సినిమా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతున్న దేవర ప్రజెంట్ ట్రెండ్ చూస్తూ ఉంటే…
రెండో రోజుకి ఏమాత్రం తీసిపోని విధంగా 16-18 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు అంచనాలను మించితే 18-20 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే ఔట్ రైట్ ఛాన్స్ కూడా ఉందని చెప్పాలి ఇప్పుడు….
ఇక హిందీలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు ఎక్స్ లెంట్ గా జోరు చూపిస్తూ ఉండగా ఈ రోజు డబుల్ డిజిట్ నెట్ కలెక్షన్స్ ని దాటేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి….ఇక ఫైనల్ లెక్కలు బాగుంటే 11-12 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకోవచ్చు….
ఇక సినిమా కర్ణాటకలో మరోసారి ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపిస్తూ ఉండగా తమిళనాడు మరియు కేరళలో పర్వాలేదు అనిపిస్తూ ఉండగా ఓవర్సీస్ లో మరోసారి మాస్ రచ్చ చేస్తుంది….దాంతో మూడొ రోజు వరల్డ్ వైడ్ గా సినిమా….
30-31 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే ఈ మార్క్ ని కూడా సినిమా మించి పోయే అవకాశం ఎంతైనా ఉంది….ఓవరాల్ గా మూడో రోజు మిక్సుడ్ టాక్ తోనే యంగ్ టైగర్ మాస్ జాతర సృష్టిస్తున్నాడు. ఇక టోటల్ గా 3 రోజుల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.