బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 2 రోజుల్లో ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara part 1) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో 2 రోజుల్లో ఓవరాల్ గా సాలిడ్ రికవరీని సొంతం చేసుకుని దుమ్ము లేపింది…ఇక మూడో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది సినిమా ఇప్పుడు…
తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు మంచి స్టార్ట్ ను సొంతం చేసుకోగా నైజాంలో కొంచం డ్రాప్స్ ఉన్నా కూడా ఆంధ్ర సీడెడ్ ఏరియాల్లో మంచి హోల్డ్ ని చూపెడుతూ కొన్ని సెంటర్స్ లో గ్రోత్ ని కూడా చూపెడుతూ ఉండటంతో మూడో రోజు మంచి జోరుతో కలెక్షన్స్ ని దక్కించుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…
ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి 16-18 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా నైట్ షోలకు ట్రెండ్ లో గ్రోత్ ఇలానే కొనసాగితే ఈ లెక్క మించే అవకాశం ఉంది. ఇక హిందీలో సినిమా మూడో రోజు మరోసారి డీసెంట్ గ్రోత్ ని చూపెడుతూ దూసుకు పోతున్న సినిమా…
ఈ రోజు డబుల్ డిజిట్ నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…. ఇక సినిమా కర్ణాటకలో సినిమా మరోసారి ఎక్స్ లెంట్ గా జోరు ని చూపెడుతూ ఉండగా తమిళ్ అండ్ కేరళలో పెద్దగా గ్రోత్ కనిపించడం లేదు…ఇక ఓవర్సీస్ లో మరోసారి పర్వాలేదు అనిపిస్తున్న సినిమా…
ఓవరాల్ గా ఇదే ట్రెండ్ రోజు మొత్తం కొనసాగిస్తే మూడో రోజు వరల్డ్ వైడ్ గా 26-28 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక నైట్ షోలకు గ్రోత్ ఉంటే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. ఇక మొత్తం మీద మూడో రోజు ఎండ్ అయ్యే టైంకి ఇదే రేంజ్ లో జోరు చూపిస్తుందా లేక ఇంతకుమించి ముందుకు వెళుతుందో చూడాలి ఇక…