Home న్యూస్ గంటకి 80వేల టికెట్స్ ఏంటి సామి….3rd డే కల్కి రికార్డ్ ఓపెనింగ్స్!

గంటకి 80వేల టికెట్స్ ఏంటి సామి….3rd డే కల్కి రికార్డ్ ఓపెనింగ్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) అన్ని చోట్లా దుమ్ము లేపే రేంజ్ లో హోల్డ్ ని రెండో రోజు చూపించింది….రెండో రోజు వర్కింగ్ డే నే అయినా కూడా రిమార్కబుల్ జోరుని చూపించిన సినిమా ఇప్పుడు మూడో రోజు నుండే వీకెండ్ అడ్వాంటేజ్ ను ఎంజాయ్ చేయబోతుంది…..

ఇవాళ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉన్నా కూడా అన్ని చోట్లా సినిమా బుకింగ్స్ రెండో రోజు కన్నా కూడా బెటర్ గా ప్రతీ గంటలో టికెట్ సేల్స్ సాలిడ్ గా ఇంప్రూవ్ అవుతూ ఉండటం సినిమా రాంపెజ్ కి నిదర్శనం, రెండో రోజు కన్నా కూడా ప్రతీ గంటకి టికెట్ సేల్స్ లో గ్రోత్ ఉండగా ఇప్పుడు ఏకంగా గంటకి 80 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ తో దుమ్ము లేపితుంది కల్కి మూవీ…

దాంతో రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న కల్కి మూవీ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు మరోసారి ఇదే రేంజ్ లో హోల్డ్ చేస్తూ ఉండగా…కొన్ని చోట్ల గ్రోత్ కూడా చూపిస్తూ రెండో రోజుకి మించే కలెక్షన్స్ ని ఈ రోజు అందుకునే అవకాశం ఉందీ అనిపించేలా జోరు చూపిస్తుంది ఇప్పుడు…

ఇక హిందీ లో మొదటి 2 రోజులను మించిన ఊచకోత కోస్తున్న సినిమా ఈ రోజు హోల్డ్ ని చూస్తూ ఉంటే క్రికెట్ మ్యాచ్ ఇంపాక్ట్ ఉన్నా కూడా 28 కోట్ల రేంజ్ నుండి 30 కోట్ల రేంజ్ లో…నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆశ్యర్యకరంగా తమిళ్ అండ్ కేరళ ఏరియాలు అండర్ పెర్ఫార్మ్ చేస్తాయి అనుకున్నా కూడా మొదటి 2 రోజుల కన్నా కూడా….

బెటర్ గా ట్రెండ్ అవుతూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు, ఇక కర్ణాటకలో మూడో రోజు ఊరమాస్ హోల్డ్ ని చూపిస్తున్న ఈ సినిమా ఓవరాల్ గా…ప్రజెంట్ ఓపెనింగ్స్ ను బట్టి చూస్తూ ఉంటే మూడో రోజు ఇండియాలో 45 కోట్లకు పైగా షేర్ మార్క్ ని ఈజీగా అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఓవర్సీస్ లో కూడా సినిమా ఎక్స్ లెంట్ గా జోరు ని చూపించడంతో వరల్డ్ వైడ్ గా 3వ రోజు సినిమా సెన్సేషనల్ రాంపెజ్ ను చూపించబోతుంది. ఇక డే ఎండ్ అయ్యే టైంకి సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here