మొదటి 2 రోజులలో ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) నటించిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలంటైన్(Operation Valentine) సినిమా వీకెండ్ ని కంప్లీట్ చేసుకునే పనిలో ఉండగా రెండో రోజు ముందు డ్రాప్స్ ఎక్కువగానే ఉండేలా అనిపించినా కూడా ఓవరాల్ గా…
పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని ఇప్పుడు మూడో రోజు సండే అడ్వాంటేజ్ తో బరిలోకి దిగిన సినిమా కి క్లాస్ సెంటర్స్ మల్టీప్లెక్సులలో పర్వాలేదు అనిపించేలా ఆక్యుపెన్సీ ఉండగా… మాస్ సెంటర్స్ లో మాత్రం సినిమా బుకింగ్స్ నిరాశ పరిచే విధంగానే ఉన్నాయి అని చెప్పాలి.
ఓవరాల్ గా సినిమా మూడో రోజు బుకింగ్స్ ట్రెండ్ చూస్తూ ఉంటే ఆల్ మోస్ట్ డే 1 రేంజ్ లో కనిపిస్తూ ఉండగా ఆంధ్రలో కొంచం పర్వాలేదు అనిపించేలా బుకింగ్స్ ఉండగా ఓవరాల్ గా మూడో రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అటూ ఇటూగా 75 నుండి 80 లక్షల రేంజ్ దాకా షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది, ఇక వరల్డ్ వైడ్ గా సినిమా మూడో రోజు కోటి లెవల్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా బెటర్ కలెక్షన్స్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక టోటల్ గా వీకెండ్ కలెక్షన్స్ రిపోర్ట్ ఎలా ఉంటుందో చూడాలి.