Home న్యూస్ 3rd DAY రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ కలెక్షన్స్…ఇదేం కుమ్ముడు సామి!!

3rd DAY రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ కలెక్షన్స్…ఇదేం కుమ్ముడు సామి!!

0

ఈ వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ్ డబ్బింగ్ సినిమాలు 2 రిలీజ్ అవ్వగా వాటిలో ప్రదీప్ రంగనాథన్‌(Pradeep Ranganathan) నటించిన లేటెస్ట్ మూవీ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ (Return Of The Dragon) ఎక్స్ లెంట్ టాక్ ను సొంతం చేసుకుని కలెక్షన్స్ పరంగా బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేస్తూ దుమ్ము లేపుతుంది.

రెండో రోజు అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయి సంచలనం సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు మూడో రోజు సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దుమ్ము లేపుతూ ఉండటం విశేషమని చెప్పాలి.

ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ ఇంపాక్ట్ ఉన్నా కూడా తమిళ్ లో ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆల్ మోస్ట్ రెండో రోజు కి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో జోరు చూపెడుతూ ఉండటం విశేషం..

దాంతో తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు మరోసారి 2 కోట్లకు పైగానే గ్రాస్ మార్క్ ని సినిమా అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ లెక్కలు బాగుంటే అంచనాలను ఇంకా మించే అవకాశం ఉంది. ఇక తమిళనాడులో సినిమా ఈ రోజు ఊపు చూస్తుంటే డబుల్ డిజిట్ గ్రాస్ ను..

టచ్ అండ్ గో చేసే అవకాశం కనిపిస్తూ ఉండగా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా లో కూడా డీసెంట్ హోల్డ్ ని చూపిస్తున్న సినిమా ఓవర్సీస్ లో సైతం అంచనాలను మించి కుమ్మేస్తూ ఉండటం విశేషం. దాంతో మూడో రోజున సినిమా వరల్డ్ వైడ్ గా…

18-20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మరోసారి అందుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఓ కొత్త హీరో సినిమాకి మూడో రోజు ఇలాంటి వసూళ్లు సొంతం అవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఇక సినిమా మూడో రోజు ఈ అంచనాలను ఎంతవరకు మించి పోయి మాస్ భీభత్సం సృష్టిస్తుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here