బాక్స్ ఆఫీస్ దగ్గర 2 రోజుల్లోనే 250 కోట్లకు పైగా వసూళ్ళని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ సలార్(Salaar Movie) మూడో రోజు సండే అడ్వాంటేజ్ ఉండగా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా ట్రెండ్ ను చూపిస్తూ దూసుకు పోతుంది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా డే 2 కన్నా బెటర్ గా…
ట్రెండ్ ను చూపిస్తూ ఉండగా మేజర్ గా నైజాం ఏరియాలో రిమార్కబుల్ ట్రెండ్ ను చూపిస్తుంది. చాలా వరకు సండే నైజాం నైట్ షోలకు డ్రాప్స్ ఉంటాయి, కానీ క్రిస్టమస్ హాలిడే మండే ఉండటంతో డే 3 నైజాం నైట్ షోలలో కూడా మాస్ రాంపేజ్ ఉంది, ఇక సీడెడ్ లో కూడా దుమ్ము లేపుతున్న సినిమా ఆంధ్ర లో ఈ రోజు జోరు అందుకుంది.
దాంతో ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో 22 కోట్ల రేంజ్ నుండి 23 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపోతే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక హిందీ లో ఫస్ట్ 2 రోజుల కన్నా కూడా…
బెటర్ గా ట్రెండ్ అవుతున్న సినిమా కర్ణాటక, తమిళ్ కేరళలో కూడా స్ట్రాంగ్ గా హోల్డ్ చేస్తుంది. ఓవర్సీస్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుండటంతో ఈ రోజు సినిమా వరల్డ్ వైడ్ గా 50 కోట్ల రేంజ్ నుండి 52 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ఇక వరల్డ్ వైడ్ గ్రాస్ లెక్క 90 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉంది, ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ లెక్క కొంచం అటూ ఇటూగా ఉండవచ్చు. మొత్తం మీద డైనోసార్ సలార్ 3వ రోజు కలెక్షన్స్ తాండవం ఆడుతుంది. ఇక టోటల్ గా సినిమా 3 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ లెక్క ఏ విధంగా ఉంటుందో చూడాలి.