Home న్యూస్ డంకి 3 డేస్ టోటల్ కలెక్షన్స్…..ఇలా అయితే కష్టమే!

డంకి 3 డేస్ టోటల్ కలెక్షన్స్…..ఇలా అయితే కష్టమే!

0

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) నటించిన లేటెస్ట్ మూవీ డంకి(Dunki Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి డీసెంట్ రిపోర్ట్స్ ను సొంతం చేసుకున్నా కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం షారుఖ్ పఠాన్, జవాన్ లతో పోల్చితే ఏమాత్రం జోరుని అయితే చూపించ లేక పోతుంది అనే చెప్పాలి ఇప్పుడు…

సినిమా ఉన్నంతలో మూడో రోజు గ్రోత్ ని చూపించి 25 కోట్ల దాకా నెట్ కలెక్షన్స్ ను సొంతం చేసుకోగా టోటల్ గా మూడు రోజుల ఇండియా నెట్ కలెక్షన్స్ లెక్క 73 కోట్లకు పైగా ఉండగా ఇండియా టోటల్ గ్రాస్ లెక్క 85 కోట్ల దాకా సొంతం చేసుకుంది. ఇక ఓవర్సీస్ లో సినిమా సాలిడ్ గానే ట్రెండ్ అవుతూ ఉండగా అక్కడ…

సినిమా 70 కోట్లకు పైగా గ్రాస్ ను ఇప్పటి వరకు సొంతం చేసుకోగా టోటల్ గా సినిమా 3 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ లెక్క 155 కోట్లకు పైగా ఉంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద జానర్ దృశ్యా పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేస్తున్నా కూడా సినిమా మీద అలాగే…

షారుఖ్ రాజ్ కుమార్ హిరాణిల క్రేజీ కాంబో మీద అంచనాల దృశ్యా చూసుకుంటే ఏమాత్రం హోల్డ్ ని అయితే చూపించడం లేదు, కానీ ఉన్నంతలో ఇప్పుడు 4వ రోజు సండే అడ్వాంటేజ్ 5వ రోజు క్రిస్టమస్ హాలిడే ఉండటంతో ఈ రెండు రోజుల్లో 52-55 కోట్ల దాకా నెట్ కలెక్షన్స్ ను ఇండియా లో సొంతం చేసుకునే అవకాశం అయితే ఉందని చెప్పాలి.

కానీ ఓవరాల్ గా షారుఖ్ ప్రీవియస్ 2 మూవీస్ రిజల్ట్ అలాగే షారుఖ్ హిరాణిల కాంబోకి ఏమాత్రం న్యాయం చేసే విధంగా ఈ సినిమా కలెక్షన్స్ ను అయితే సొంతం చేసుకోవడం లేదు, ఇక లాంగ్ వీకెండ్ లో సినిమా ఓవరాల్ గా ఎలాంటి కలెక్షన్స్ ను ఇప్పుడు సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here