బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ తెలుగు తమిళ్ బైలింగువల్ మూవీ సార్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతుంది. మొదటి 2 రోజుల్లో ఊహకందని రేంజ్ లో హోల్డ్ చూపించి వసూళ్ళని సొంతం చేసుకున్న ఈ సినిమా ధనుష్ కి తెలుగు లో భారీ హిట్ దిశగా దూసుకు పోతుంది ఇప్పుడు. ఇక సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర…
మూడో రోజులో ఎంటర్ అవ్వగా మొదటి 2 షోలు కొంచం డ్రాప్స్ ను ఎక్కువగానే సొంతం చేసుకున్నా కానీ తిరిగి సినిమా మంచి బుకింగ్స్ తో జోరు చూపించడం స్టార్ట్ చేసింది. హైదరాబాద్ మరోసారి మేజర్ కలెక్షన్స్ ని అందుకుంటూ ఉండగా సీడెడ్ ఏరియాలో కూడా ఈ సీరియస్ మూవీ కి…
మంచి రెస్పాన్స్ వస్తూ ఉండటం విశేషం. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు మరోసారి 2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు గ్రాస్ లెక్క అటూ ఇటూగా ఇప్పుడు 4 కోట్ల దాకా ఉండొచ్చని అంచనా…
తమిళనాడుకి ఈక్వల్ గా తెలుగు వర్షన్ కలెక్షన్స్ దుమ్ము లేపుతూ ఉండగా సినిమా ఇక వర్కింగ్ డేస్ లో ఇదే హోల్డ్ ని చూపిస్తే కచ్చితంగా సినిమాను కొన్న వాళ్ళందరికీ కూడా సెన్సేషనల్ ప్రాఫిట్స్ ను దక్కించి పెట్టడం ఖాయమని చెప్పాలి. ఇక మొదటి వీకెండ్ సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.