Home న్యూస్ 2nd డే కూడా కుమ్ముతున్న కిరణ్ అబ్బవరం….సాలిడ్ డే 2!!

2nd డే కూడా కుమ్ముతున్న కిరణ్ అబ్బవరం….సాలిడ్ డే 2!!

0

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ వినరో భాగ్యము విష్ణు కథ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజున అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువ వసూళ్ళని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర కిరణ్ అబ్బవరంకి మంచి కంబ్యాక్ మూవీ గా నిలిచింది. శివరాత్రి హాలిడే కూడా కలిసి రావడంతో రెట్టించిన జోరు చూపించి దుమ్ము లేపిన ఈ సినిమా ఇప్పుడు రెండో రోజులో ఎంటర్ అవ్వగా…

రెండో రోజు కూడా సండేనే అవ్వడంతో మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హోల్డ్ ని చూపిస్తూ దూసుకు పోతుంది. ఓవరాల్ గా మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీలకు 40% రేంజ్ లో డ్రాప్స్ ఉన్నా తర్వాత నుండి బుకింగ్స్ బాగానే కొనసాగుతూ ఉండటంతో…

ఇప్పుడు రెండో రోజు సినిమా మరోసారి మంచి కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది, అటూ ఇటూగా సినిమా ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 80-90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్…

బాగుంటే ఈ లెక్క 1 కోటి మార్క్ ని కూడా అందుకునే అవకాశం ఉందని చెప్పాలి… మొత్తం మీద రెండో రోజు కూడా సూపర్బ్ హోల్డ్ నే చూపించిన సినిమా మూడో రోజు నుండి వర్కింగ్ డేస్ లో ఎలా హోల్డ్ చేస్తుంది అన్నది ఆసక్తికరం. ఇక టోటల్ 2 డేస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here