బాక్స్ ఆఫీస్ దగ్గర నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ వీర సింహా రెడ్డి రెండో రోజు అనుకున్న దాని కన్నా కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. వాల్తేరు వీరయ్య సినిమా ఇంపాక్ట్ వలన వీర సింహా రెడ్డి కి డ్రాప్స్ కొంచం ఎక్కువగా రాగా ఇక మూడో రోజు వారసుడు సినిమా రిలీజ్ కూడా ఉండటంతో బాలయ్య సినిమా థియేటర్స్ కొంచం తగ్గాయి కానీ మొత్తం మీద….
ఇప్పుడు మూడో రోజు సినిమా రెండో రోజుతో పోల్చితే బెటర్ ఆక్యుపెన్సీతో దూసుకుపోతుంది సినిమా. మాస్ సెంటర్స్ లో ముఖ్యంగా రాయలసీమలో మంచి హోల్డ్ ని చూపిస్తున్న సినిమా మిగిలిన చోట్ల కొత్త సినిమాల ఇంపాక్ట్ వలన పర్వాలేదు అనిపిస్తుంది.
ఓవరాల్ గా సినిమా రెండో రోజుతో పోల్చితే బెటర్ ఆక్యుపెన్సీతో రన్ అవుతూ ఉండటంతో ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో సినిమా 7 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పాలి. ఇక సినిమా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే…
సినిమా వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్నంతలో మంచి జోరుని చూపిస్తూ పరుగును కొనసాగిస్తుంది. ఇక డే ఎండ్ అయ్యే టైంకి మొత్తం మీద సినిమా ఇదే రేంజ్ లో ఉంటుందా లేక ఇంకా జోరు చూపించి వసూళ్ళని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక…