మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో భారీగా సందడి చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ స్పెషల్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. సినిమాలో ఆల్ రెడీ 2 సాంగ్స్ ను రిలీజ్ చేయగా 2 సాంగ్స్ కి కూడా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం అయింది. ఇక రీసెంట్ గా సినిమాలోని మూడో పాట అయిన సినిమా టైటిల్ థీమ్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి…
టైం చెప్పగా ఆ టైం కి రిలీజ్ చేయకుండా ఆలస్యంగా సాంగ్ ను రిలీజ్ చేసినా కానీ ఆ సాంగ్ ఆడియన్స్ కు బాగా నచ్చేసింది…. దేవి శ్రీ ప్రసాద్ మాస్ బీట్స్ కి మెగాస్టార్ ఊరమాస్ అవతార్ అండ్ స్వాగ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవడంతో…
సాంగ్ అనుకున్న అంచనాలను కూడా మించి పోయే రేంజ్ లో మెప్పించింది అని చెప్పాలి. సినిమాలో ఈ సాంగ్ కి థియేటర్స్ షేక్ అవ్వడం ఖాయం అనిపిస్తుంది. ఇక లేట్ రిలీజ్ చేసినా కానీ సాంగ్ కి 24 గంటల్లో ఓవరాల్ గా ఎక్స్ లెంట్ రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పాలి.
24 గంటలు కంప్లీట్ అయ్యే టైం కి యూట్యూబ్ లో 5.47 మిలియన్ వ్యూస్ ని 170.4K లైక్స్ ని సొంతం చేసుకుని ఓవరాల్ గా సాలిడ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్న ఈ సాంగ్ సినిమా పై అంచనాలను మరింతగా పెంచేసింది అని చెప్పాలి. ఇక సినిమాలో మిగిలిన సాంగ్స్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.