బాక్స్ ఆఫీస్ దగ్గర నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి(Bhagavanth Kesari) మూవీ రెండు వారాలను పూర్తి చేసుకుని మూడో వారంలో అడుగు పెట్టింది. మిగిలిన దసరా సినిమాలతో పోల్చితే తెలుగు రాష్ట్రాల్లో పాజిటివ్ రెస్పాన్స్ తో…
లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తున్న ఈ సినిమా మూడో వారంలో కొత్త సినిమాలు రిలీజ్ అవ్వడంతో థియేటర్స్ ని సాలిడ్ గా కోల్పోతుంది అని అందరూ అనుకున్నా కూడా మేజర్ ఏరియాల్లో సాలిడ్ హోల్డ్ నే సినిమా చూపించింది.
మొత్తం మీద సినిమా మూడో వారంలో నైజాంలో 135 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేయగా సీడెడ్ లో 60 వరకు థియేటర్స్ ని ఆంధ్రలో మొత్తం మీద 110 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేసింది. దాంతో మూడో వారంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఇప్పుడు మొత్తం మీద…
305 వరకు థియేటర్స్ లో రన్ ని కొనసాగిస్తూ ఉండటం విశేషం. సినిమా ఇంకా 2 కోట్ల లోపు షేర్ ని మిగిలిన రన్ లో అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండగా సినిమా వీకెండ్ లో మినిమం జోరు చూపించి వర్కింగ్ డేస్ లో స్టడీ కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తే…
బ్రేక్ ఈవెన్ ని అందుకుని లాభాలను కూడా ఓవరాల్ గా సొంతం చేసుకునే అవకాశం ఉంది. మరి సినిమా ఉన్న ఈ థియేటర్స్ లో మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తుందో చూడాలి ఇక…