Home న్యూస్ జిగర్ తండ2 ట్రైలర్ రివ్యూ…ఇలా ఉందేంటి!!

జిగర్ తండ2 ట్రైలర్ రివ్యూ…ఇలా ఉందేంటి!!

0

మన తెలుగు లో 2019 టైంలో వరుణ్ తేజ్(Varun Tej) హీరోగా తెరకెక్కిన గద్దలకొండ గణేష్ సినిమా అందరికీ గుర్తు ఉండే ఉంటుంది, ఆ సినిమా ఒరిజినల్ వర్షన్ తమిళ్ లో జిగర్ తండ అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకోగా రీమేక్ తెలుగు లో కూడా బాగానే ఆడింది….

ఇప్పుడు ఒరిజినల్ వర్షన్ కి సీక్వెల్ గా జిగర్ తండ2(Jigar thanda Double X ) అంటూ కొత్త సినిమా రూపొందగా దీపావళి కానుకగా ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతుంది… ఈ పార్ట్ లో రాఘవ లారెన్స్(Raghava Lawrence) మరియు SJ సూర్య మెయిన్ రోల్స్ చేస్తూ ఉండగా రీసెంట్ గా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు…

కాగా ట్రైలర్ చూసిన తర్వాత ఇది ఆల్ మోస్ట్ జిగర్ తండ మాదిరిగానే అనిపించింది అని చెప్పాలి. ఒక రౌడీ హీరో అవ్వాలి అనుకుంటాడు, ఒక డైరెక్టర్ ని పిలిపిస్తాడు… ఆ డైరెక్టర్ ఆ రౌడీని హిరోలా ఎలా చూపించాడు తర్వాత ఏమయింది అన్నది సినిమా కాన్సెప్ట్…

ఆల్ మోస్ట్ ఒరిజినల్ వర్షన్ ఇలానే ఉండగా ఇందులో కూడా ఎదో ఒక స్పెషాలిటీ కానీ ఎదో ఒక బిగ్ ట్విస్ట్ ఉండే అవకాశం అయితే ఉంటుంది కానీ ప్రస్తుతానికి ట్రైలర్ వరకు మాత్రం కన్ఫ్యూజింగ్ గా అలాగే జిగర్ తండ మారిగానే అనిపించడంతో ట్రైలర్ కి కొంచం మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం అయింది అని చెప్పాలి.

ఈ దీపావళికి స్ట్రైట్ మూవీస్ ఏవి రిలీజ్ కి సిద్ధం అవ్వడం లేదు, అన్నీ డబ్బింగ్ మూవీస్ కాగా కార్తీ జపాన్ తో ఈ సినిమా పోటి పడబోతుంది. మరి బాక్స్ అఫీస్ దగ్గర సినిమా ఎంతవరకు పార్ట్ 1 తో పోల్చితే ఎక్కువగా మెప్పించి కలెక్షన్స్ పరంగా జోరు చూపిస్తుందో లేదో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here