Home న్యూస్ మిక్సుడ్ టాక్ తో ఈ లాంగ్ రన్ ఏంటి సామి….3 వీక్స్ అరణ్మనై4 టోటల్ కలెక్షన్స్!

మిక్సుడ్ టాక్ తో ఈ లాంగ్ రన్ ఏంటి సామి….3 వీక్స్ అరణ్మనై4 టోటల్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక సినిమాకి మిక్సుడ్ టాక్ వస్తే ఆ సినిమా తేరుకునే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుంది, కొన్ని సినిమాలు మాత్రమే సేఫ్ జోన్ లో నిలుస్తాయి. లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన తమిళ్ మూవీ అరణ్మనై4(Aranmanai4 Movie)  సినిమా ఈ కోవలోకే చెందే సినిమా అని చెప్పాలి.

సినిమాకి మిక్సుడ్ టాక్ వచ్చింది, రొటీన్ హర్రర్ కామెడీ మూవీ అని ఆడియన్స్ నుండి టాక్ వచ్చినా కూడా తమిళ్ లో సమ్మర్ లో చూడటానికి అసలు సినిమాలు ఏమి లేక పోవడంతో ఈ సినిమానే ఆప్షన్ గా అనుకున్న ఆడియన్స్ ఎగబడి ఈ సినిమాకే వెళ్లి చూస్తూ ఉండగా మూడో వీక్ లో సైతం సినిమా మంచి కలెక్షన్స్ తో…

దుమ్ము లేపుతూ ఇప్పుడు మొత్తం మీద 87 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుని 100 కోట్ల మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా తెలుగు లో టోటల్ గా మాత్రం 5 కోట్ల దాకా గ్రాస్ ను 2.35 కోట్ల రేంజ్ దాకా షేర్ ని అందుకోగా వాల్యూ బిజినెస్ 2.5 కోట్లకి చాలా చేరువగా వచ్చింది…

ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 3 వారాలలో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Aranmani4(Baak) 21 Days Movie Total World Wide Collections
👉Tamilnadu – 58.65Cr
👉Telugu States- 5.00Cr
👉Ka+ROI – 5.40Cr
👉Overseas – 18.20Cr***(Updated)
Total WW collection –87.25CR(42.10CR~ Share) Approx

ఇదీ ఓవరాల్ గా సినిమా మూడు వారాల్లో సాధించిన సెన్సేషనల్ కలెక్షన్స్ రాంపెజ్…ఇక్కడ మరో విశేషం ఏంటి అంటే మిక్సుడ్ టాక్ ఈ ఫ్రాంచేజ్ లో సైతం హైయెస్ట్ కలెక్షన్స్ ని ఈ సినిమా సొంతం చేసుకుంది. నాలుగో వీకెండ్ లో మళ్ళీ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here