కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో సూర్య కూడా ఒకరు అయినా కానీ రీసెంట్ టైం లో సూర్య నటించిన సినిమాలు ఏవి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ అవ్వక పోవడంతో ఆ ఇంపాక్ట్ సూర్య స్టార్ పవర్ పై భారీగా ఎఫెక్ట్ చూపి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా ఇంపాక్ట్ తగ్గుతూ వస్తుంది. లేటెస్ట్ గా సూర్య…
నటించిన ఈటీ ఎవ్వరికీ తల వంచడు సినిమా ఆడియన్స్ ముందుకు రాగా టోటల్ గా సినిమా 53.50 కోట్ల బిజినెస్ ను సాధించగా 110 కోట్ల గ్రాస్ టార్గెట్ తో బరిలోకి దిగింది. సినిమా తెలుగు లో 3.5 కోట్ల బిజినెస్ ను అందుకుని 4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా….
4 రోజుల లాంగ్ వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది…
👉Nizam: 51L
👉Ceeded: 27L
👉UA: 22L
👉East: 17L
👉West: 11L
👉Guntur: 16L
👉Krishna: 15L
👉Nellore: 11L
AP-TG Total:- 1.70CR(3.25CR~ Gross)
బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే సినిమా ఇంకా 2.3 కోట్ల షేర్ ని….
మిగిలిన రన్ లో సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండగా మొత్తం మీద 4 రోజుల వీకెండ్ లో తమిళనాడు లో సినిమా 31 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాల అంచనా… ఇక కేరళలో 3.3 గ్రాస్ ను అందుకోగా కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా లో 1.4 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సాధించిందట.
దాంతో టోటల్ గా ఇండియా లో సినిమా 38.95 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుందట. ఇక ఓవర్సీస్ లో 5.1 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సాధించిందట సినిమా…. దాంతో 4 రోజుల వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా 44.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సినిమా సొంతం చేసుకుందట. ఈ లెక్కన 110 కోట్ల రేంజ్ గ్రాస్ టార్గెట్ ని అందుకోవాలి అంటే ఇంకా 65.95 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సినిమా ఇంకా సొంతం చేసుకోవాల్సి ఉంటుంది.