మిగిలిన ఇండస్ట్రీలు ఇంకా థియేటర్స్ కి జనాలను ఎలా తీసుకు రావాలి రా బాబు అని అనుకుంటూ ఉన్న టైం లో టాలీవుడ్ ఇండస్ట్రీ ఆల్ రెడీ హిట్ సినిమాలతో జోరు చూపడం మొదలు పెట్టి దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది, బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ రెడీ రెండో పాండమిక్ తర్వాత SR కళ్యాణ మండపం సినిమా సాలిడ్ విజయాన్ని దక్కించుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దుమారం చేయగా…
ఇప్పుడు అఫీషియల్ గా 4 రోజుల్లో మరో సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి సాలిడ్ కలెక్షన్స్ తో విజయాన్ని నమోదు చేసుకుంది. బాక్ టు బాక్ రెండు ఫ్లాఫ్ మూవీస్ తర్వాత శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ రాజ రాజ చోర బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా…
సినిమాకి మొదటి ఆటకే ఆడియన్స్ నుండి మంచి టాక్ లభించింది, కానీ మొదటి రోజు కలెక్షన్స్ పరంగా కొంచం స్లోగా మొదలు అయినా ఈవినింగ్ షోల నుండి జోరు చూపడం మొదలు పెట్టిన ఈ సినిమా కలెక్షన్స్ ని రోజు రోజుకి పెంచుకుంటూ ఇప్పుడు 4 రోజులు పూర్తీ అయ్యే టైం కి…
బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో 2.77 కోట్ల రేంజ్ లో షేర్ ని దక్కించుకోగా వరల్డ్ వైడ్ గా 3.32 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది. సినిమా ఓవరాల్ బిజినెస్ 2.2 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా 2.4 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా ఇప్పుడు 4 రోజులు పూర్తీ అయ్యే టైం కి 92 లక్షల రేంజ్ లో ప్రాఫిట్ ను….
ఆల్ రెడీ సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచింది. ఇండియాలో సెకెండ్ పాండమిక్ తర్వాత రెండో క్లీన్ హిట్ మూవీ గా నిలిచిన సినిమా గా మారింది రాజ రాజ చోర సినిమా. ఆ రెండు సినిమాలు కేవలం టాలీవుడ్ నుండే రావడం మన సినీ లవర్స్ సినిమా ల పై ఎలాంటి ప్రేమ చూపుతారో అన్నదానికి నిదర్శనం అని చెప్పాలి.