Home గాసిప్స్ 4 వరుస డిసాస్టర్లు…అయినా రవితేజ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్!

4 వరుస డిసాస్టర్లు…అయినా రవితేజ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్!

0

మాస్ మహారాజ్ రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర తనదైన రేంజ్ లో హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది, అయినా కానీ రవితేజ తో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎప్పుడూ సిద్దంగా ఉండటమే కాకుండా రెమ్యునరేషన్ కూడా సాలిడ్ ఇస్తూ రావడం ఎప్పటికప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతూ వస్తూ ఉండేది. కాగా లేటెస్ట్ గా రవితేజ ఒక్కో సినిమాకు ఎంతవరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అన్నది బయటికి న్యూస్ వచ్చింది.

ఆ న్యూస్ ప్రకారం మాస్ మహారాజ్ హిట్స్ ఫ్లాఫ్స్ కి సంభందం లేకుండా తన లేటెస్ట్ మూవీస్ అన్నింటికీ కూడా ఆల్ మోస్ట్ 10 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నారట. టాలీవుడ్ లో ఫ్లాఫ్స్ పడ్డా… అది కూడా రీసెంట్ టైం లో…

వరుస డిసాస్టర్లు పడ్డా కూడా ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా రవితేజ పేరు చెప్పుకుంటున్నారు. క్రాక్ సినిమా కి కూడా అదే రేంజ్ లో రెమ్యునరేషన్ ని తీసుకున్నారట రవితేజ. బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా రవితేజ నుండి మళ్ళీ…

బ్లాక్ బస్టర్ హిట్స్ తో పాటు ఇయర్ కి మినిమమ్ రెండు మూడు సినిమాలను ఎక్స్ పెర్ట్ చేస్తున్నారు. ఈ సారి నుండి రవితేజ కూడా ఇదే ఫార్ములా ని తిరిగి ఫాలో అయ్యి ఇయర్ కి కచ్చితంగా మినిమమ్ రెండు నుండి మూడు సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యి వరుసగా కథలను ఒప్పుకుంటూ సినిమాలను కమిట్ అవుతూ వస్తున్నాడు.

క్రాక్ తర్వాత రమేష్ వర్మ తో సినిమా, తర్వాత త్రినాధ రావ్ నక్కిన మూవీ, తర్వాత సురేందర్ రెడ్డి, మారుతి ఇలా రవితేజ అప్ కమింగ్ మూవీస్ లైనప్ సాలిడ్ గా ఉంది, దాంతో ఈ సినిమాలు అన్నీ వర్కౌట్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర మునుపటి ఫాం ని రవితేజ అందుకోవడం ఖాయంగా చెప్పుకోవచ్చు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here