కెరీర్ లో అపజయం అంటే తెలియని డైరెక్టర్ అనిల్ రావిపూడి నిర్మాతగా మారి కథ అందించిన సినిమా గాలి సంపత్, శ్రీ విష్ణు, ర్రాజేంద్ర ప్రసాద్ ల కాంబినేషన్ లో రూపొందిన ఈ సినిమా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చింది. కాగా సినిమా కి పర్వాలేదు బాగుంది అన్న టాక్ రాగా, రాజేంద్ర ప్రసాద్ రోల్ కి యునానిమస్ రెస్పాన్స్ ఉంది ఆడియన్స్ లో. సినిమా కి అనిల్ రావిపూడి బ్రాండ్ వలన…
మొత్తం మీద 6.5 కోట్ల బిజినెస్ జరిగింది, సినిమా 7 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి రోజే లోవేస్ట్ కలెక్షన్స్ తో షాక్ ఇచ్చిన ఈ సినిమా తర్వాత రెండో రోజు కూడా ఏమాత్రం గ్రోత్ ని సాధించలేక కేవలం 12 లక్షల షేర్ నే సొంతం చేసుకుంది, ఇక మూడో రోజు…
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పట్టుమని 8 లక్షల షేర్ ని కూడా అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు రోజులకే పరుగును ముగించే స్టేజ్ కి వచ్చింది. ఇక రిలీజ్ అవ్వడం 410 థియేటర్స్ గ్రాండ్ గా జాతిరత్నాలు సినిమా కన్నా ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా…
ఇప్పుడు మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర పట్టుమని 100 థియేటర్స్ లో కూడా ఆడటం లేదు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. సినిమా బాగానే ఉన్నా పక్కన ఒక ఎంటర్ టైనర్ ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ మూవీస్ కష్టమే అవుతుంది, సోలోగా రిలీజ్ అయ్యి ఉంటె కొంచం బెటర్ రిజల్ట్ ను సొంతం చేసుకుని ఉండేది ఈ సినిమా.
కానీ ఇప్పుడు పోటి లో బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు నుండే అండర్ పెర్ఫార్మ్ చేసి మూడో రోజుకే చేతులు ఎత్తేసిన ఈ సినిమాను కొన్న వాళ్ళు తీవ్ర నష్టాలలో మునిగిపోవడం ఖాయంగా కనిపిస్తుంది, థియేటర్స్ లో పెర్సేంటేజ్ బేస్ మీద రన్ అవుతుంది… ఇక వీకెండ్ తర్వాత సినిమా పరిస్థితి మరింత దయనీయంగా ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతూ ఉండటం విచారకరం…