Home న్యూస్ జాతిరత్నాలు, శ్రీకారం, గాలి సంపత్, రాబర్ట్ బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ రిపోర్ట్….!!

జాతిరత్నాలు, శ్రీకారం, గాలి సంపత్, రాబర్ట్ బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ రిపోర్ట్….!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మహా శివరాత్రి వీకెండ్ లో నాలుగు సినిమాలు పోటి పడ్డాయి, వేటి రేంజ్ లో అవి బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవ్వగా ఓపెనింగ్స్ పరంగా ఏ సినిమా ఎక్కువ దుమ్ము లేపుతుంది, ఏ సినిమా స్లోగా ఉందొ తెలుసుకుందాం పదండీ… ముందుగా స్లోగా ఉన్న సినిమాల విషయానికి వస్తే… అనుకున్నట్లుగానే తెలుగు మూవీస్ లో గాలి సంపత్ మూవీ వీక్ ఓపెనింగ్స్ తో రోజును మొదలు పెట్టింది అని చెప్పాలి.

రెండు తెలుగు రాష్ట్రాలలో మిగిలిన మూవీస్ లో వీకేస్ట్ ఓపెనింగ్స్ ఈ సినిమాకే ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోల టైం కి గ్రోత్ చూపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రజంట్ ట్రెండ్ ని బట్టి 1 కోటి రేంజ్ ఓపెనింగ్స్ ని అందుకోవచ్చు.

ఇక శ్రీకారం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ టికెట్ హైక్స్ తో రిలీజ్ అవ్వగా సినిమా ఓపెనింగ్స్ మీడియం రేంజ్ లో ఉన్నాయి, క్లాస్ సెంటర్స్ లో బాగున్నా మాస్ సెంటర్స్ లో యావరేజ్ రేంజ్ లో ఉన్నాయి. అయినా కానీ టికెట్ హైక్స్ ఉండటం ఎక్కువ థియేటర్స్ కాబట్టి సినిమా 3 కోట్లకు పైగానే షేర్ ని సొంతం చేసుకోవచ్చు.

ఇక తెలుగు మూవీస్ లో చిన్న మూవీనే సెన్సేషనల్ బుకింగ్స్ తో దుమ్ము లేపిన జాతిరత్నాలు సినిమా ఓపెనింగ్స్ ఎక్స్ ట్రా ఆర్డినరీ అనిపించే లెవల్ లో ఉండగా సినిమా ఈవినింగ్ నైట్ షోలకు మరింత రెచ్చిపోయే అవకాశం ఉండగా సినిమా మినిమమ్ 4 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది, ఇక రోజు ముగిసే టైం కి లెక్క మరింత పెరగొచ్చు.

ఇక కన్నడ డబ్బింగ్ మూవీ రాబర్ట్ మొత్తం మీద బిలో యావరేజ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది, మాస్ సెంటర్స్ లో ఓకే కానీ మిగిలిన సెంటర్స్ లో సినిమా బిలో యావరేజ్ గా ఉంది, కానీ ఈవినింగ్ షోలకు కొంచం పుంజుకోవచ్చు, అలా జరిగితే 20 లక్షల రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకోవచ్చు. మరి అన్ని సినిమాల నైట్ షోల స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here