లోక నాయకుడు కమల్ హాసన్ స్వీయ నిర్మాణంలో రూపొందిన లేటెస్ట్ మూవీ విక్రమ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో తమిళనాడులో ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపగా… సినిమా ఇప్పటి వరకు ఆల్ మోస్ట్ 410 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఇప్పటికీ లిమిటెడ్ కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తూ ఉంది.
బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రేంజ్ లో విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ బడ్జెట్ ఎంత అన్న ఆసక్తి అందరిలో ఉండటం ఖాయం, కాగా కమల్ హాసన్ రెమ్యునరేషన్ ఏమి తీసుకోకుండా తన నిర్మాణంలోనే సినిమాను నిర్మించడం జరిగింది. ఓవరాల్ గా కమల్ హాసన్ రెమ్యునరేషన్ ని పక్కకు పెడితే…
సినిమా మొత్తం మీద 60 కోట్ల రేంజ్ బడ్జెట్ లో పూర్తీ అయ్యిందని కోలివుడ్ ట్రేడ్ లో సమాచారం. ఇక కమల్ హసన్ రెమ్యునరేషన్ ఓ 30 కోట్లు అని వాల్యూ వేసినా మొత్తం మీద 90 కోట్ల లోపు బడ్జెట్ లోనే సినిమా పూర్తీ అయింది అని చెప్పొచ్చు. ఆ లెక్కన బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సాధించిన కలెక్షన్స్ అలాగే నాన్ థియేట్రికల్ రైట్స్ తో కమల్ హసన్ కి అత్యంత భారీ ప్రాఫిట్స్ ని ఈ సినిమా సొంతం అయ్యేలా చేసింది అని చెప్పాలి.