Home న్యూస్ అక్షరాలా 485 కోట్లు ఔట్….4 రోజుల్లో రికార్డుల భీభత్సం ఇది!!

అక్షరాలా 485 కోట్లు ఔట్….4 రోజుల్లో రికార్డుల భీభత్సం ఇది!!

0

మొదటి మూడు రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 132.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా 380.70 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) 4వ రోజు సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోయింది…

తెలుగు రాష్ట్రాల్లో 4వ రోజున సినిమా అటూ ఇటూగా 32-34 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోబోతున్న కల్కి మూవీ హిందీలో మాత్రం రెట్టించిన జోరు చూపిస్తూ ఓవరాల్ గా 40 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక సినిమా కర్ణాటక, తమిళ్ అలాగే కేరళ ఏరియాలు కలిపి ఓవరాల్ గా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు…..

16-18 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఓవరాల్ గా ఇండియాలో సినిమా ఇప్పుడు 90 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక ఓవర్సీస్ లో మరోసారి స్ట్రాంగ్ గా హోల్డ్ చేస్తున్న సినిమా 15-17 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు…

బాక్స్ అఫీస్ దగ్గర ఇప్పుడు 106-108 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ కలెక్షన్స్ తో సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 165 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 485 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది…

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ వీకెండ్ లో ఊహకందని కలెక్షన్స్ తో ప్రభాస్ కెరీర్ లో బాహుబలి2 తర్వాత బెస్ట్ వీకెండ్ కలెక్షన్స్ తో సంచలనం సృష్టించింది… ఇక సినిమా మొత్తం మీద 4 రోజుల లాంగ్ వీకెండ్ లో టోటల్ గా ఏరియాల వారిగా సినిమా సాధించే కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here