Home న్యూస్ ఫైటర్ ఔట్….3 రోజుల్లో ఇండియా No1 గా ప్రభాస్ “కల్కి”!!

ఫైటర్ ఔట్….3 రోజుల్లో ఇండియా No1 గా ప్రభాస్ “కల్కి”!!

0

2024 ఇయర్ ఓవరాల్ గా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 6 నెలల్లో అంచనాలను అందుకున్న సినిమాలు చాలా తక్కువే అని చెప్పాలి….మేజర్ ఇండస్ట్రీ లు అయిన బాలీవుడ్ టాలీవుడ్ లో కొన్ని మంచి సినిమాలు వచ్చినా భారీ రికార్డులు నమోదు చేసినవి తక్కువే…మలయాళ ఇండస్ట్రీ వరుస బ్లాక్ బస్టర్స్ ను అందుకున్నా కూడా ఇండియన్ మూవీస్ లో ఓవరాల్ గా హైయెస్ట్ కలెక్షన్స్ ని అయితే అందుకోలేక పోయాయి…

ఉన్నంతలో జనవరిలో రిలీజ్ అయిన హృతిక్ రోషన్(Hrithik Roshan) నటించిన ఫైటర్(Fighter Movie) టోటల్ రన్ లో 364 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుని రీసెంట్ టైం వరకు టాప్ ఇండియన్ గ్రాసర్ ఆఫ్ 2024 ఇయర్ గా నిలిచింది…కానీ ఈ సినిమా ఫైనల్ రన్ కలెక్షన్స్ ని జస్ట్ అలా 3 రోజుల్లో బ్రేక్ అయిపోయాయి ఇప్పుడు…

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) బాక్స్ ఆఫీస్ దగ్గర జస్ట్ మూడు రోజుల్లోనే 380 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోగా ఫైటర్ సినిమా గ్రాస్ ను క్రాస్ చేసేసి ఇప్పుడు ఈ ఇయర్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఇండియన్ మూవీస్ లో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ ని…

   

అందుకున్న సినిమాగా దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది…ఇప్పుడు 500 కోట్ల బెంచ్ మార్క్ తర్వాత కల్కి మూవీ ఇలానే హోల్డ్ ని కొనసాగిస్తే….ఈ ఇయర్ సెకెండ్ ఆఫ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చే పాన్ ఇండియా మూవీస్ కి బిగ్గెస్ట్ టార్గెట్ ను సెట్ చేసి పెట్టే అవకాశం ఎంతైనా ఉంది….

ఆల్ రెడీ టాలీవుడ్ తరుపున కూడా ఈ ఇయర్ బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న ఈ సినిమా ఈ ఇయర్ ఫస్టాఫ్ కి ఎక్స్ లెంట్ ఎండ్ ని ఇచ్చి హైయెస్ట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది. ఇక టోటల్ రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధించి ఇయర్లో వచ్చే ఇతర సినిమాలకు ఎలాంటి టార్గెట్ ను సెట్ చేసి పెడుతుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here