అప్పుడప్పుడు కొన్ని చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని సక్సెస్ లను సొంతం చేసుకుంటూ ఉంటాయి, సినిమా కి క్రేజ్ ఉండి యూత్ లో ఆ సినిమా పై ఆసక్తి ఉంటే చాలు కలెక్షన్స్ వర్షం కురిపించడం ఖాయం, ఈ ఇయర్ అలాంటి హిట్స్ కొన్ని టాలీవుడ్ లో సెకెండ్ వేవ్ ముందు వచ్చిన సినిమాల్లో సాధించగా అన్ని సినిమాలను మించి ఒక్క చిన్న సినిమా భీభత్సం సృష్టించిందని చెప్పాలి.
ఆ సినిమానే నవీన్ పోలిశెట్టి నటించిన లేటెస్ట్ మూవీ జాతిరత్నాలు. మార్చ్ నెల ని అన్ సీజన్ అంటారు, అలాంటి నెలలో బాక్స్ ఆఫీస్ దగ్గర ఊరమాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవరాల్ గా సాధించిన టోటల్ రెవెన్యూ అందరి మైండ్ బ్లాంక్ చేసేలా ఉంది.
సినిమా ను మొత్తం మీద 4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు, ఇక సినిమా ఓవరాల్ బిజినెస్ 11 కోట్లు, నాన్ థియేట్రికల్ బిజినెస్ 12.75 కోట్ల రేటు, హిందీ రీమేక్ రైట్స్ 2.3 కోట్లు కలిపాయి. అంటే మొత్తం మీద బిజినెస్ 26.05 కోట్లు సాధించిన ఈ సినిమా… ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్…
కంప్లీట్ అయ్యే టైం కి ఏకంగా 64.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకుంది. 11 కోట్ల బిజినెస్ కి 64.2 కోట్ల గ్రాస్ అండ్ 38.52 షేర్ తో భీభత్సం సృష్టించింది. దాంతో మొత్తం మీద సినిమా ఓవరాల్ రెవెన్యూ 90.25 కోట్ల మార్క్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా. 4 కోట్ల బడ్జెట్ మీద టోటల్ రన్ పూర్తీ అయ్యాక…
ఏకంగా 90.25 కోట్ల రెవెన్యూ ని సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు, సినిమా కి ఇన్వాల్వ్ అయిన అందరికీ విపరీతమైన లాభాలను సొంతం చేసుకునేలా చేసిన ఈ సినిమా ఇప్పుడు హిందీ లో రీమేక్ కానుంది, అక్కడ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.