బాక్స్ ఆఫీస్ దగ్గర న్యూ ఇయర్ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో చిన్న సినిమానే అయినా యూత్ ని అట్రాక్ట్ చేసే కంటెంట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా బబుల్ గం(Bubble Gum Movie) … సినిమా రిలీజ్ అయిన మొదటి షోకే మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా…
పోటిలో సలార్(Salaar Movie) తో పాటు డెవిల్(Devil Movie) కూడా ఉండటంతో ఈ సినిమా మూడో ఆప్షన్ గా మారిపోగా మిక్సుడ్ టాక్ ఇంపాక్ట్ తర్వాత కలెక్షన్స్ పరంగా పెద్దగా జోరుని అయితే సినిమా చూపించ లేక పోయింది అనే చెప్పాలి.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద లాంగ్ 4 డేస్ ఎక్స్ టెండెడ్ వీకెండ్ కంప్లీట్ అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో 25-30 లక్షల రేంజ్ లోనే షేర్ ని 75 లక్షలకు అటూ ఇటూగా గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా 35 లక్షల లోపు షేర్ ని సినిమా సొంతం చేసుకుందని ట్రేడ్ సమాచారం.
ఓవరాల్ గా సినిమా వీకెండ్ లో నిరాశ కలిగించే కలెక్షన్స్ ను సొంతం చేసుకోగా సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 2.3 కోట్ల దాకా ఉంటుందని అంచనా. ఆ లెక్కన సినిమా 2.5 కోట్లు అయినా షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, కానీ సినిమా పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా ఉండటంతో నిరాశ కలిగించే రిజల్ట్ తోనే సినిమా పరుగును పూర్తి చేసుకోబోతుంది.