యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs Of Godavari Movie) సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా టాక్ మిక్సుడ్ గా ఉన్నా కూడా మొదటి వీకెండ్ లో మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకున్న ఈ సినిమా 4వ రోజులో వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా ఉన్నంతలో…
మంచి హోల్డ్ నే బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించి మాస్ సెంటర్స్ లో హోల్డ్ ని కొనసాగించింది. చాలావరకు వీకెండ్ తర్వాత 4వ రోజు డ్రాప్స్ 70% రేంజ్ లో ఉంటాయి కానీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మాత్రం 50% రేంజ్ లోనే డ్రాప్స్ ను సొంతం చేసుకుని మంచి హోల్డ్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించడం విశేషం అని చెప్పాలి.
సినిమా 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 73 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మంచి హోల్డ్ ని చూపించగా వరల్డ్ వైడ్ గా సినిమా 87 లక్షల రేంజ్ లో షేర్ ని 1.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా 4 రోజులు పూర్తి అయ్యే టైంకి సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Gangs Of Godavari 4 Days Total World Wide Collections Report
👉Nizam: 2.77Cr
👉Ceeded: 1.42Cr
👉UA: 86L
👉East: 57L
👉West: 45L
👉Guntur: 51L
👉Krishna: 44L
👉Nellore: 31L
AP-TG Total:- 7.33CR(12.60CR~ Gross)
👉KA+ROI: 0.52Cr
👉OS: 1.02Cr
Total WW:- 8.87CR (16.10CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగగా మొత్తం మీద 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 2.13 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా మిగిలిన వర్కింగ్ డేస్ లో ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుందో చూడాలి.