బాక్స్ ఆఫీస్ దగ్గర మంచు విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ జిన్నా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి పర్వాలేదు అనిపించే రేంజ్ టాక్ ఆడియన్స్ నుండి లభించినా కానీ అనుకున్న రేంజ్ లో అయితే కలెక్షన్స్ ని సొంతం చేసుకోలేక పోయింది. ప్రతీ రోజు కలెక్షన్స్ డౌన్ ఫాల్ అవుతూ రాగా ఎట్టకేలకు సినిమా కి 4వ రోజు దీపావళి హాలిడే వలన కొంచం గ్రోత్ అయితే సొంతం అయ్యింది…
సినిమా మరో సారి 3వ రోజు లెవల్ లో 6-8 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకోగా మొత్తం మీద సినిమా 3 లక్షల గ్రోత్ ని చూపించి మొత్తం మీద 11 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో సినిమా టోటల్ గా…
తెలుగు రాష్ట్రాల్లో 4 రోజులు కంప్లీట్ అయ్యే టైం కి 41 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా గ్రాస్ లెక్క 75 లక్షల దాకా ఉంది, ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 45 లక్షల దాకా షేర్ ని అందుకోగా గ్రాస్ 85 లక్షల దాకా సొంతం చేసుకుంది.
సినిమా టోటల్ బిజినెస్ వాల్యూ అటూ ఇటూగా 4 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా ఈ మార్క్ ని అందుకోవాలి అంటే ఇంకా చాలా చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుంది, కొంచం గ్రోత్ అండ్ డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది కాబట్టి మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.