ఛలో సినిమా తో కెరీర్ లో బిగ్ బ్లాక్ బస్టర్ ని అందుకున్న తర్వాత నాగశౌర్య నటించిన ఏ సినిమా కూడా అంచనాలను అందుకోలేక పోయింది. లాస్ట్ ఇయర్ చేసిన సినిమాలు నిరాశ పరిచిన తర్వాత ఎప్పుడో ఆడియన్స్ ముందుకు రావాల్సిన నాగశౌర్య నటించిన లేటెస్ట్ మూవీ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి సినిమా మొదటి ఆటకే నెగటివ్ టాక్ ను సొంతం చేసుకుంది…
దాంతో ఏ దశలో కూడా తేరుకోలేక పోయిన సినిమా మూడో రోజు సండే అయినా కానీ 25 లక్షల రేంజ్ లో గ్రాస్ నే అందుకోగా సినిమా 4వ రోజు వర్కింగ్ డే లో కేవలం 12 లక్షల రేంజ్ లోనే గ్రాస్ ను సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచి దెబ్బ మీద దెబ్బ పడింది…
మొత్తం మీద సినిమా ఇప్పుడు టోటల్ గా 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 1.57 కోట్ల దకా గ్రాస్ ను అందుకోగా 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల ఆవల 65 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 4 రోజుల్లో ఇప్పుడు 2.22 కోట్ల దాకా….
గ్రాస్ కలెక్షన్స్ ని దక్కించుకుంది. మొత్తం మీద సినిమా వర్త్ షేర్ 1.04 కోట్ల దాకా ఉందని అంచనా. సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే 3.4 లోట్ల దాకా షేర్ ని సాధించాల్సి ఉంటుంది. ఇక అది అందుకోవడం అసాధ్యం అనే చెప్పాలి ఇప్పుడు. ఇక మిగిలిన రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.