Home న్యూస్ ఇండస్ట్రీ హిట్ రీమేక్….4 డేస్ కలెక్షన్స్ తో బాలీవుడ్ మైండ్ బ్లాంక్!!

ఇండస్ట్రీ హిట్ రీమేక్….4 డేస్ కలెక్షన్స్ తో బాలీవుడ్ మైండ్ బ్లాంక్!!

0

ఐకాన్ అల్లు అర్జున్ నటించిన నాన్ SSR ఇండస్ట్రీ హిట్ మూవీ అల వైకుంఠ పురంలో సినిమా రీసెంట్ గా హిందీలో అఫీషియల్ గా శహజాదా పేరు తో రీమేక్ అవ్వగా సినిమాను టీం ఎంతో కష్టపడని ప్రమోట్ చేసినా కానీ సినిమా కి అనుకున్న రేంజ్ లో అయితే బజ్ ఏర్పడలేదు, దాంతో సినిమా మొదటి రోజు నుండే ఇక్కడ అండర్ పెర్ఫార్మ్ చేయగా బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్ డీసెంట్ గా…

ఉన్నప్పటికీ కూడా సినిమా జోరుని చూపించలేక పోయింది. దాంతో సినిమా వీకెండ్ కే అతి కష్టం మీద 20 కోట్ల లోపే నెట్ కలెక్షన్స్ ని అందుకోగా 4 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం 23 కోట్ల లోపే నెట్ కలెక్షన్స్ ని అందుకుని తీవ్రంగా నిరాశ పరిచింది ఈ సినిమా…

బాలీవుడ్ లో రీమేక్ లు రీసెంట్ టైంలో అనుకున్న విధంగా పెర్ఫార్మ్ చేయడం లేదు, కానీ ఈ సినిమా కచ్చితంగా కంటెంట్ బాగానే ఉండటంతో జోరు చూపిస్తుంది అనుకున్నా కానీ కలెక్షన్స్ పరంగా ఒరిజినల్ వర్షన్ రేంజ్ తో కంపేర్ చేస్తే దరిదాపుల్లో కూడా లేని విధంగా…

బాక్స్ ఆఫీస్ దగ్గర పెర్ఫార్మ్ చేస్తున్న సినిమా మొత్తం మీద రీమేక్ ల విషయంలో మరో నిరాశ కలిగించే రిజల్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఏదైనా అద్బుతం జరిగితే తప్పితే సినిమా ఇక తేరుకునే అవకాశం లేనట్టె అని అక్కడ ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here