బాక్స్ ఆఫీస్ దగ్గర అఖండ ముందు వరకు కెరీర్ లోనే లోఫెస్ట్ ఫామ్ లో ఉన్న నట సింహం నందమూరి బాలకృష్ణ….అఖండ నుండి నాన్ స్టాప్ గా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ సంచలన ఫామ్ తో బాక్ టు బాక్ హిట్స్ తో మాస్ రచ్చ చేస్తూ దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతూ ఉండగా ఫ్లాఫ్ అనేది లేకుండా ఆల్ మోస్ట్ 4 బాక్ టు బాక్ హిట్స్ ను…
బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని మాస్ రచ్చ చేశాడు…ఆల్ మోస్ట్ 3 ఏళ్ల గ్యాప్ లోనే 4 సినిమాలతో సంచలనం సృష్టించిన బాలయ్య ఇతర స్టార్స్ పాన్ ఇండియా మూవీస్ అంటూ ఏళ్లకి ఏళ్ళు గ్యాప్ తీసుకుంటూ ఉంటుంటే.. 3 ఏళ్ల గ్యాప్ లో 4 సినిమాలతో రచ్చ చేశాడు బాలయ్య….
ఇక బాలయ్య నటించిన లాస్ట్ 4 సినిమాల టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ లెక్క 530 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుని సీనియర్స్ లో మాస్ భీభత్సం సృష్టించాడు….అఖండ మూవీ టోటల్ రన్ లో 133 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోగా తర్వాత చేసిన వీర సింహా రెడ్డి సినిమా…
134 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించి కెరీర్ బెస్ట్ రికార్డ్ ను నమోదు చేశాడు…ఇక తర్వాత చేసిన భగవంత్ కేసరి సినిమా 132 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోగా టోటల్ గా 3 సినిమాల టోటల్ గ్రాస్ లెక్క 399 కోట్ల మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించగా…
ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన డాకు మహారాజ్ మూవీ కూడా ఆల్ మోస్ట్ ఇప్పటి వరకు 132 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని ఇప్పటి వరకు అందుకోగా టోటల్ గా 4 సినిమాల టోటల్ గ్రాస్ లెక్క ఇప్పుడు ఏకంగా 500 కోట్ల మార్క్ ని దాటేసి ఏకంగా 530 కోట్ల మమ్మోత్ గ్రాస్ తో సంచలనం సృష్టించింది.
లాంగ్ రన్ లో డాకు మహారాజ్ బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ షేర్ అండ్ గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఈ సినిమాల తర్వాత ఆడియన్స్ ముందుకు అఖండ2 తో రానున్న బాలయ్య ఆ సినిమా తో అంచనాలను మించి భీభత్సం సృష్టించే అవకాశం ఉంది…