టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి మూడు రోజుల్లో 77 కోట్లకు పైగా షేర్ ని అందుకోగా సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 55.8 కోట్లకు పైగా షేర్ ని వసూల్ చేసింది. ఇక సినిమా నాలుగో రోజు అసలు సిసలు వీకెండ్ మొదలు అవ్వడం తో రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి ట్రెండ్ నే కొనసాగిస్తూ దూసుకు పోతుంది ఈ సినిమా.
3 వ రోజు తో పోల్చితే ఆన్ లైన్ టికెట్ సేల్స్ డ్రాప్స్ 20% లోపే ఉండటం ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా ఆక్యుపెన్సీ 3 వ రోజు కన్నా ఎక్కువ ఉండటం తో సినిమా 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి వసూళ్ళ ని సాధించడం ఖాయమని చెప్పొచ్చు.
సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగితే 4 వ రోజు 3 వ రోజు లెవల్ లో కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది, అంటే ఆల్ మోస్ట్ 5% డ్రాప్స్ రేంజ్ లో నే ఉండే చాన్స్ ఉందన్న మాట. ఇక సినిమా తెలుగు రాష్ట్రాల వరకు వీరంగం సృష్టిస్తున్నా కానీ మిగిలిన చోట్ల మాత్రం షాక్ తప్పడం లేదు.
హిందీ లో గ్రోత్ ఏమాత్రం కనిపించడం లేదు, 4 వ రోజు కూడా చాలా లిమిటెడ్ కలెక్షన్స్ నే సినిమా సాధించేలా కనిపిస్తుంది. ఇక సినిమా కర్ణాటక తప్పితే మిగిలిన చోట్ల కలెక్షన్స్ బిలో యావరేజ్ లెవల్ లో ఉండగా ఓవర్సీస్ లో పర్వాలేదు అనిపించే విధంగా ఉన్నాయి. దాంతో మొత్తం మీద వరల్డ్ వైడ్ గా సినిమా 4 వ రోజున…
9 నుండి 10 కోట్ల రేంజ్ షేర్ ని అందుకునే అవకాశం ఉందని అంటున్నారు. అన్ని వర్షన్స్ లో డ్రాప్స్ ఎక్కువగా ఉన్నా తెలుగు రాష్ట్రాల సపోర్ట్ తో సినిమా ఓవరాల్ గా మంచి వసూళ్ళనే సాధిస్తుంది. ఇక సినిమా 4రోజులకు గాను అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.