మాస్ మహారాజ్ రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ అల్టిమేట్ కంబ్యాక్ ఇచ్చిన సినిమా క్రాక్, జనవరి లో సంక్రాంతి సమయం లో కేవలం 50% ఆక్యుపెన్సీ లిమిటేషన్ లు ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా అద్బుతమైన కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకుని రవితేజ కెరీర్ లోనే ఆల్ టైం నంబర్ 1 షేర్ వసూల్ చేసిన సినిమా గా నిలిచింది. అనేక గడ్డు పరిస్థితులను ఎదురుకున్నా సినిమా సూపర్ విజయం సాధించగా…
తర్వాత స్టార్ మా ఛానెల్ సినిమా శాటిలైట్ రైట్స్ హక్కులను 6 కోట్ల ఫ్యాన్సీ రేటు ని చెల్లించి రైట్స్ ని దక్కించుకోగా సినిమా టెలివిజన్ లో టెలికాస్ట్ అయిన ప్రతీ సారి మంచి TRP రేటింగ్ ని దక్కించు కోవడం విశేషం ఫస్ట్ టైం…
11.71 TRP రేటింగ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రెండో సారి టెలికాస్ట్ టైం లో కూడా 7.52 రేటింగ్ ను సొంతం చేసుకుని అద్బుతంగా హోల్డ్ చేసింది, ఇక మూడో సారి టెలికాస్ట్ కి రేటింగ్ రెండో సారి కన్నా మూడో సారి ఎక్కువ TRP రేటింగ్ ను సొంతం చేసుకుంది.
మూడో సారి ఈ సినిమా 7.92 రేటింగ్ ను సొంతం చేసుకోగా రీసెంట్ గా నాలుగో సారి కూడా సినిమాను త్వరగానే టెలికాస్ట్ చేశారు. కానీ ఈ సారి మాత్రం రేటింగ్ కి దెబ్బ పడినట్లు అయింది. సినిమా ని ఇతర ఛానెల్స్ లో వచ్చిన రంగ్ దే మరియు అల వైకుంఠ పురం లో సినిమాలకు పోటిగా టెలికాస్ట్ చేయగా TRP క్లాష్ అయింది.
దాంతో క్రాక్ 4 వ సారి టెలికాస్ట్ కి కేవలం 4.76 రేటింగ్ మాత్రమే సొంతం అయింది. ఇది కూడా డీసెంట్ రేటింగే కానీ సినిమా మొదటి 3 సార్లతో కంపేర్ చేస్తే రేటింగ్ బాగా తగ్గింది అని చెప్పాలి. మొత్తం మీద సినిమా ను 6 కోట్లకు కొన్న స్టార్ మా కి ఆల్ రెడీ భారీ ప్రాఫిట్స్ వచ్చాయి కాబట్టి ఇది పెద్దగా ఎఫెక్ట్ ఏమి చూపదు అని చెప్పాలి.