బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్ నాగార్జున నాగ చైతన్య ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ బంగార్రాజు రిలీజ్ అయ్యి మూడు వారాలను పూర్తీ చేసుకుని ఇప్పుడు నాలుగో వారంలో అడుగు పెట్టింది,… సినిమా మూడు వారాలలో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే ఇంకో 80 లక్షల లోపు కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉండగా ఇప్పుడు సినిమా 4 వ వారంలో రెండు తెలుగు రాష్ట్రాలలో…
హోల్డ్ చేస్తున్న టోటల్ థియేటర్స్ కౌంట్ 215 వరకు ఉందని సమచారం. అందులో నైజాంలో 63 థియేటర్స్ సీడెడ్ లో 35 వరకు థియేటర్స్ లో హోల్డ్ చేసిన బంగార్రాజు సినిమా… ఆంధ్ర రీజన్ లో 115 కి పైగా థియేటర్స్ లో పరుగును ఇప్పుడు కొనసాగిస్తూ ఉంది…
దాంతో ఓవరాల్ గా నాలుగో వారంలో ఈ సినిమా 215 థియేటర్స్ లో రన్ అవుతూ ఉండగా మూడో వారంలో 400 థియేటర్స్ ని హోల్డ్ చేసిన సినిమా ఇప్పుడు నాలుగో వారంలో ఆల్ మోస్ట్ సగం తగ్గింది… మరి కలెక్షన్స్ పరంగా సినిమా ఎంతవరకు వసూళ్లు ఈ వారంలో సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక.