Home న్యూస్ 4th డే బేబి కలెక్షన్స్…వర్కింగ్ డే లో ఇదేం ఊచకోత సామి!!

4th డే బేబి కలెక్షన్స్…వర్కింగ్ డే లో ఇదేం ఊచకోత సామి!!

0

వీకెండ్ లోనే రిమార్కబుల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన బేబి(Baby Movie) బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని లాభాల బాటలోకి ఎంటర్ అవ్వగా సినిమా సూపర్ హిట్ గా నిలిచి ఇప్పుడు వర్కింగ్ డే లోకి ఎంటర్ అవ్వగా 4వ రోజు సినిమాకి నైజాం ఏరియాలో…

బోనాలు పండగ అడ్వాంటేజ్ తో మరోసారి ఆల్ మోస్ట్ హాలిడే రేంజ్ అడ్వాంటేజ్ లభించడంతో అన్ని చోట్లా ఎక్స్ లెంట్ హోల్డ్ తో దూసుకు పోతూ ఉండటం విశేషం, అదే టైంలో ఆంధ్ర సీడెడ్ లో నార్మల్ వర్కింగ్ డే అయినా కూడా సినిమా కొన్ని సెంటర్స్ లో…

Baby Movie 4th Day Box Office Collections Report

Baby The Movie 3 Days WW Collections!!

ఏకంగా 3వ రోజు లెవల్ లో హోల్డ్ చేసి ఊహకందని ఊచకోత కోస్తూ దూసుకు పోతుంది. సినిమా ఆల్ మోస్ట్ 3వ రోజుతో పోల్చితే 4వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 30% కి అటూ ఇటూగా డ్రాప్స్ ను ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో సొంతం చేసుకుంది కానీ…

ఆఫ్ లైన్ లో కౌంటర్ దగ్గర సింగిల్ స్క్రీన్స్ లో కాలేజ్ స్టూడెంట్స్ తో ఊపు కనిపించడంతో ఈ రోజు మరోసారి 2 కోట్లకు పైగా షేర్ కన్ఫాం అవ్వగా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించితే 2.2 కోట్ల నుండి 2.4 కోట్ల రేంజ్ లో షేర్ ని…

అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా ఈ రోజు 2.8 కోట్ల రేంజ్ నుండి 3 కోట్ల లోపు షేర్ ని అందుకునే ఔట్ రైట్ ఛాన్స్ ఉందని చెప్పాలి. పార్షిక వర్కింగ్ డే లో ఇది సెన్సేషనల్ హోల్డ్ అని చెప్పొచ్చు. మొదటి 3 రోజుల మాదిరిగా ఈ రోజు కూడా సినిమా అంచనాలను మించి కలెక్షన్స్ ని సాధిస్తుందో లేదో చూడాలి ఇక.

Baby The Movie 1st Day Collections- Sensational Openings!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here