మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ధమాకా మూవీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మొదటి వీకెండ్ ని కంప్లీట్ చేసుకోగా సినిమా కి 4వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర పార్షిక హాలిడే అడ్వాంటేజ్ లభించడంతో సినిమా మార్నింగ్ షోలు డ్రాప్ అయినా కానీ తిరిగి మ్యాట్నీ షోల నుండి సినిమా మంచి జోరునే చూపిస్తూ దూసుకు పోతూ ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోల టైం కి…
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరుని చూపిస్తూ ఉందని చెప్పాలి ఇప్పుడు. సినిమా మొత్తం మీద 4వ రోజు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు అటూ ఇటూగా 2.8 కోట్ల రేంజ్ నుండి 3 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు…
అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉండగా సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా 3.2 కోట్ల నుండి 3.3 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇంతకన్నా మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటే…
సినిమా సెన్సేషనల్ ఊచకోత కోసిందని అంచనా వేయవచ్చు. ఓవరాల్ గా టార్గెట్ లో చాలా మొత్తాన్ని రికవరీ చేస్తున్న ధమాకా ఇక ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయ్యేందుకు సిద్ధం అవుతుందని చెప్పొచ్చు. ఇక సినిమా టోటల్ గా 4 రోజులకు గాను సాధించే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.