బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి మూడు రోజుల్లో లిమిటెడ్ గానే అయినా మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగించిన గాడ్ ఫాదర్ సినిమా మూడు రోజుల తర్వాత ఇప్పుడు 4వ రోజులో అడుగు పెట్టగా వీకెండ్ స్టార్ట్ అవ్వడంతో అన్ని చోట్లా బుకింగ్స్ 3వ రోజుతో పోల్చితే బెటర్ గానే ఉన్నాయి అని చెప్పాలి. ఆల్ మోస్ట్ 10% వరకు గ్రోత్ తో సినిమా 4వ రోజు మార్నింగ్ షోలను…
కంప్లీట్ చేసుకోగా మ్యాట్నీ షోల నుండి సినిమా మంచి జోరునే చూపిస్తుంది. మిగిలిన కొత్త సినిమాలను జనాలు అసలు పట్టించుకోక పోవడంతో ఆడియన్స్ కి గాడ్ ఫాదర్ ఒక్కటే ఆప్షన్ గా మారింది. దాంతో ఇప్పుడు 4వ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు లెవల్ లో..
కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం ఆల్ మోస్ట్ కన్ఫాం అనే చెప్పాలి. ఈవినింగ్ షోల బుకింగ్స్ కూడా జోరు అందుకుంటున్న నేపధ్యంలో సినిమా మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రజెంట్ ట్రెండ్ ని బట్టి 6 కోట్లకి అటూ ఇటూగా షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…
అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 6.5 కోట్ల దాకా షేర్ ని సినిమా 4వ రోజు సొంతం చేసుకోవచ్చు. అంతకన్నా మించి వస్తూ అదే బోనస్ అనే చెప్పాలి కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఈ 2 రోజుల్లో ఎంత కుదిరితే అంత వెనక్కి రాబట్టుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది.