మొదటి వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరుని చూపించిన శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన లేటెస్ట్ మూవీ ఓం భీమ్ బుష్(Om Bheem Bush) సినిమా 4వ రోజున నార్మల్ గా అయితే వర్కింగ్ డే లోకి ఎంటర్ అవ్వాలి కానీ హోలీ హాలిడే అడ్వాంటేజ్ సినిమా కి ఇప్పుడు సొంతం అయ్యింది…
దాంతో మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరు ని చూపెడుతూ బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు ఒక్కో అడుగు ముందుకేస్తూ దూసుకు పోతుంది ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో ట్రాక్ చేసిన సెంటర్స్ లో ఓవరాల్ గా సినిమా మరోసారి మంచి హోల్డ్ ని చూపించగా మొత్తం మీద డే 3 తో పోల్చితే డే 4 లో….
డ్రాప్స్ 30% రేంజ్ దాకా కనిపిస్తూ ఉండగా సినిమా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 80-90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక అంచనాలను మించిపొతే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పాలి….
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 1 కోటి నుండి 1.1 కోట్ల దాకా షేర్ ని అటూ ఇటూగా అందుకునే అవకాశం ఉంది, ఓవరాల్ గా 4వ రోజున ఇవి మంచి కలెక్షన్స్ అనే చెప్పాలి. ఇక మొత్తం మీద 4 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ ఈ అంచనాలకు తగ్గట్లు ఉంటుందా లేక కొంచం అటూ ఇటూగా ఉంటాయో చూడాలి ఇప్పుడు…