Home న్యూస్ తెలుగు గడ్డ మీద రికార్డ్ కొట్టిన ప్రేమలు…..2018 మూవీ రికార్డ్ చెల్లాచెదురు!!

తెలుగు గడ్డ మీద రికార్డ్ కొట్టిన ప్రేమలు…..2018 మూవీ రికార్డ్ చెల్లాచెదురు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళం నుండి తెలుగు లోకి డబ్ అయిన ప్రేమలు(Premalu Telugu) మూవీ సెన్సేషనల్ కలెక్షన్స్ తో తెలుగు లో కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సినిమా లాంగ్ రన్ లో అద్బుతమైన లాభాలను సొంతం చేసుకోగా ఇప్పుడు తెలుగు గడ్డ మీద సరికొత్త రికార్డ్ ను సైతం నమోదు చేసింది ఈ సినిమా…

మలయాళ సినిమాల పరంగా తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా కొత్త రికార్డ్ ను నమోదు చేసింది…. ఇది వరకు మోహన్ లాల్(Mohan Lal) నటించిన పులి మురుగన్(Puli Murugan Movie) తెలుగు లో మన్యం పులి(Manyam Puli Telugu Total Collections) తెలుగు రాష్ట్రాల్లో…

9.50 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుని రికార్డ్ ను సృష్టించగా ఆ రికార్డ్ ను 2018 మూవీ బ్రేక్ చేసి టోటల్ రన్ లో 10.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుని కొత్త రికార్డ్ ను నమోదు చేయగా ఇప్పుడు ఆ రికార్డ్ ను బ్రేక్ చేసింది ప్రేమలు మూవీ…. ఈ సినిమా ఓవరాల్ 11.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా….

తెలుగు లో డబ్ అయిన మలయాళ మూవీస్ లో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సరికొత్త రికార్డ్ ను నమోదు చేసింది. స్టడీ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న ఈ సినిమా లాంగ్ రన్ లో ఇంకా కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. టోటల్ గా ఎలాంటి కలెక్షన్స్ తో రన్ ని కంప్లీట్ చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here