టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మాస్ మహారాజ్ రవితేజ ల లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా మూడు రోజుల్లో ఊహకందని రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపగా సినిమా 4వ రోజు కనుమ పార్షిక హాలిడే అడ్వాంటేజ్ తో మరోసారి అన్ని చోట్లా అనుకున్న దాని కన్నా కూడా బెటర్ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది. సినిమా ఓవర్సీస్ లో….
1.7 మిలియన్ మార్క్ ని దాటేసి 2 మిలియన్ మార్క్ వైపు అడుగులు వేస్తూ దూసుకు పోతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా అన్ని సెంటర్స్ లో ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేస్తూ దుమ్ము లేపుతుంది. నైజాం సీడెడ్ అని తేడా లేకుండా అన్ని చోట్లా…
హౌస్ ఫుల్ బోర్డులతో 4వ రోజున సినిమా దుమ్ము దుమారం లేపింది… మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అటూ ఇటూగా 9-10కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ ఇంకా పెరగవచ్చు.
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇంతకు మించి ఉండే అవకాశం ఎంతైనా ఉంది. ఇక మొత్తం మీద సినిమా 4 రోజుల్లో సాధించే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.