Home న్యూస్ 4వ రోజు AP-TGలో హైయెస్ట్ కలెక్షన్స్ మూవీస్…తన ఇండస్ట్రీ రికార్డ్ తానె బ్రేక్ చేసిన రెబల్...

4వ రోజు AP-TGలో హైయెస్ట్ కలెక్షన్స్ మూవీస్…తన ఇండస్ట్రీ రికార్డ్ తానె బ్రేక్ చేసిన రెబల్ స్టార్!!

0

3 నెలల గ్యాప్ తర్వాత టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి తిరిగి ఊపిరి పోసిన పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ సినిమా కల్కి 2898AD(Kalki2898AD Movie)తో అన్ని చోట్లా ఊహకందని కలెక్షన్స్ తో ఊచకోత కోస్తూ ఉండగా రెండు మరియు మూడో రోజులలో తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలలో టాప్ 3 ప్లేస్ ను సొంతం చేసుకున్న కల్కి మూవీ…

4వ రోజు సండే అడ్వాంటేజ్ లభించడంతో రెట్టించిన జోరు చూపించి ప్రతీ ఏరియాలో ఊరమాస్ కలెక్షన్స్ ని అందుకుని అంచనాలను అన్నీ కూడా మించి పోయే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని కుమ్మేసింది. తెలుగు రాష్ట్రాల్లో 4వ రోజున ఇది వరకు హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాగా రికార్డ్ ను…

ప్రభాస్ నటించిన సలార్ సినిమా పేరిట ఉండేది…ఇప్పుడు ఆ  సినిమా నెలకొల్పిన ఇండస్ట్రీ రికార్డ్ 4వ రోజు కలెక్షన్స్ ని బ్రేక్ చేసిన కల్కి మూవీ ఆల్ మోస్ట్ 7.8 కోట్ల రేంజ్ లో లీడ్ తో సరికొత్త ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేసి సంచలనం సృష్టించడం విశేషం… ఈ రికార్డ్ అప్ కమింగ్ మూవీస్ కి బిగ్ టార్గెట్ అనే చెప్పాలి ఇప్పుడు…

ఓవరాల్ గా 4వ రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న టాప్ మూవీస్ ని గమనిస్తే…
4th Day All Time Highest Share movies in Telugu States
👉#Kalki2898AD – 25.84CR******
👉#SALAAR – 18.05CR
👉#RRRMovie – 17.73CR
👉#Baahubali2 – 14.65Cr
👉#SarkaruVaariPaata- 12.06CR
👉#AlaVaikunthapurramuloo – 11.56Cr
👉#WaltairVeerayya – 11.42CR
👉#KGF2(Dub) – 10.81Cr
👉#GunturKaaram – 9.67Cr
👉#Saaho – 9.60Cr
👉#SarileruNeekevvaru– 8.67Cr
👉#Maharshi – 8.44Cr
👉#Akhanda- 8.31Cr

మొత్తం మీద ఇతర రికార్డ్ మూవీస్ తో పోల్చితే 4వ రోజు హాలిడే అడ్వాంటేజ్ లభించినా రికార్డ్ రికార్డే కాబట్టి కల్కి మూవీ నెలకొల్పిన ఈ మమ్మోత్ డే 4 రికార్డ్ తో బాక్ టు బాక్ రెండు సార్లు ఇండస్ట్రీ రికార్డ్ ను 4వ రోజున సొంతం చేసుకుని ప్రభాస్ సంచలనం సృష్టించాడు. ఇక లాంగ్ రన్ లో కల్కి మూవీ ఎలాంటి కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here